ఒక రోజు, ఒక గంట తేజ కావాలంటూ సురేఖ వాణి కన్నీళ్లు.. లేడీ కమెడియన్‌ మనసులో ఇంత బాధుందా?

Published : Mar 14, 2024, 01:51 PM IST

నటి సురేఖ వాణి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ,సరదాగా కనిపిస్తుంది. కానీ ఆమెలో మరోయాంగిల్‌ ఉంది. ఆమె మనసులో చెప్పలేని బాధ ఉంది. తాజాగా అది చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. 

PREV
16
ఒక రోజు, ఒక గంట తేజ కావాలంటూ సురేఖ వాణి కన్నీళ్లు.. లేడీ కమెడియన్‌ మనసులో ఇంత బాధుందా?

సురేఖ వాణి.. టాలీవుడ్‌ నటిగా రాణిస్తుంది. ఆమె ఎక్కువగా కామెడీ తరహా పాత్రలతో మెప్పించింది. కానీ ఇటీవల ఆమె జోరు తగ్గింది. భర్త చనిపోయిన తర్వాత నుంచి, అంతకు ముందు నుంచే ఒకటి అర సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ప్రస్తుతం మళ్లీ కాస్త పుంజుకుంటుంది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతుంది.  
 

26

ఇదిలా ఉంటే సురేఖ వాణి భర్త సురేష్‌ తేజ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒంటరైపోయింది సురేఖ వాణి. ఆమెకి కూతురు సుప్రీత ఉన్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ఇద్దరు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తమ గ్లామర్‌ ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఓ రకంగా మంచి లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు. మనసులో ఎంత బాధ ఉన్నా, బయటకు మాత్రం ఆనందంగానే కనిపిస్తున్నారు. 
 

36

అయితే తాజాగా ఓపెన్‌ అయ్యింది సురేఖ వాణి. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గుండెల్లో ఉన్న బరువు ఎంతో చెప్పే ప్రయత్నం చేసింది. ఈ మేరకు తన భర్త ఉంటే ఆ బాధ అంతా చెప్పుకుంటానని తెలిసింది.  సడెన్‌గా ఇంటికి పెద్ద దిక్కు పోతే ఎలా అనిపించింది, ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండింది, ఎలా లీడ్‌ చేస్తున్నారు అని యాంకర్‌ ప్రశ్నించింది. దీనికి సురేఖ వాణి రియాక్ట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. 
 

46

`ఒక రోజు, ఒకగంట, నాకు ఒక్క అవకాశం ఇస్తే, నా మనసులో ఉన్నవన్నీ చెప్పుకోవాలి తేజాకి(భర్త). ఒక్క సారి మాట్లాడుకోవాలని ఉంది. కనీసం కళ్లో అయినా ఒకసారి కనిపించి మనసు విప్పి మొత్తం మాట్లాడాలనిపిస్తుంది. ఆ అవకాశం లేదేమో అన్నట్టు. తనతో మాట్లాడాల్సిన కొన్ని నా లోపల ఉండిపోయినవి. చెప్పుకోవాల్సినవి కొన్ని ఉండిపోయినవి. నా వైపు నుంచి కొన్ని అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. నాకు వాటిని సమాధానం కావాలి. 
 

56

చెప్పుకున్నా, కానీ భారం దిగిపోవడం లేదు. తను ప్రాణాలతో లేనప్పుడు చెప్పుకున్నా. కానీ ఆ బాధ పోవడం లేదు` అంటూ భోరున విలపించింది సురేఖ వాణి. ఎప్పుడూ సరదాగా, ఫైరింగ్‌లో ఉంటూ చిల్ అయ్యే సురేఖ వాణిలో ఇంత బాధ ఉందా, ఇంతటి ఎమోషన్‌ ఉందా అనేది ఆశ్చర్యపరుస్తుంది. ఆమె కన్నీరు మున్నీరైన తీరు బాధ కలిగించేలా ఉంది. 
 

66

ఇక ప్రస్తుతం సురేఖ వాణి లైఫ్‌ని సెట్ చేసుకుంటుంది. ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అవుతుంది. ప్రస్తుతం `కన్నప్ప`లో కీలక పాత్రలో కనిపించబోతుంది. దీంతోపాటు ఒకటి రెండు సినిమాలున్నట్టు తెలుస్తుంది. అలాగే కూతురు సుప్రీతని హీరోయిన్‌గా పరిచయం చేస్తుంది. అమర్‌ దీప్‌ హీరోగా, సుప్రీత హీరోయిన్‌గా ఓ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే ఇది ప్రారంభమైంది. కూతురు సెట్‌ అయితే ఇక వారికి సమస్య లేదని చెప్పొచ్చు. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories