
నాగచైతన్య ప్రస్తుతం `తండేల్` మూవీలో నటిస్తున్నారు. చందూమొండేటి దర్శకత్వం ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ కావడం విశేషం. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మత్య్సకారుల బ్యాక్ డ్రాప్‌లో పోర్ట్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. పూర్తి రా, రస్టిక్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. గీతా ఆర్ట్స్ ఈ మూవీని భారీగా నిర్మిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ సుమారు 70కోట్ల అని తెలుస్తుంది. నాగచైతన్యపై అంత బడ్జెట్ పెట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. చైతూ నటించిన గత మూవీ `కస్టడీ` నాలబై, యాభై కోట్లతో రూపొందింది. కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కనీసం పది కోట్ల షేక్ కూడా రాలేదు. ఓటీటీ రైట్స్ కూడా తక్కువే. దీంతో నిర్మాత సగానికిపైగా నష్టాపోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు `తండేల్` విషయంలో అదే భయపెడుతుంది. బడ్జెట్ భారీగా పెరిగింది. కానీ చైతూపై అంత మార్కెట్ సాధ్యమవుతుందా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
సినిమాకి 30, నలభైకోట్ల బిజినెస్ కావడం కష్టం. ఓటీటీ ఎంత కొట్టుకున్నా ఇరవై దాటదు. పైగా ఇప్పుడు యంగ్ హీరోల సినిమాలకు ఓటీటీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. తక్కువ రేట్‌కి అడుగుతున్నారు. దీంతో ఏం చేసినా ఇది థియేట్రికల్‌గానే రాబట్టాలి. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్పా అది సాధ్యం కాదు. ఈ లెక్కన `తండేల్` విషయంలో థియేట్రికల్ వసూళ్లపైనే ఆధారపడాల్సి వస్తుంది.
దర్శకుడు చందూమొండేటి రూపొందించిన `కార్తికేయ2` వంద కోట్లు వసూలు చేసింది. దీంతో `తండేల్`పై అదే గట్ ఫీలింగ్‌తో ముందుకు వెళ్తున్నారు నిర్మాతలు. కానీ అది మైథలాజికల్ అంశాలు, సోషియో ఫాంటసీ ఎలిమెంట్లతో సాగింది. అందుకే అంతగా ఆదరణ పొందింది. మరి `తండేల్`లో ఆ స్థాయి కంటెంట్ ఉందా అనేది సస్పెన్స్. ఏం జరుగుతుంది చూడాలి. ఈ సినిమా దసరాకి విడుదల కాబోతుంది.
మరోవైపు నాని విషయంలోనూ అదే తరహా రిస్క్ జరుగుతుందనే వాదన క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన వివేక్ ఆత్రేయతో `సరిపోదా శనివారం` చిత్రంలో నటిస్తున్నారు. మాస్, యాక్షన్ మూవీగా ఇది రూపొందుతుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ రూపొందుతుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. మిగిలిన ఆరు రోజుల్లో ఇంట్లో బంధించి ఉండి, శనివారం మాత్రం విజృంభిస్తుంటాడు నాని. ఆ పాయింట్ కొత్తగా ఉంది. ఇటీవల యాక్షన్ సినిమాలు ఆడుతున్న నేపథ్యంలో `సరిపోదా శనివారం`పై ఆ ఆసక్తి ఏర్పడింది.
ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సుమారు 90కోట్లతో సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఇదే ఇప్పుడు పెద్ద షాకిస్తుంది. సినిమా ఫినీష్ అయ్యి, ప్రమోషన్స్ వరకు వంద కోట్లకు వెళ్తుంది. నానిపై ఇంతటి బడ్జెట్ అంటే పెద్ద సాహసమే. నాని నటించిన `దసరా` మూవీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ తెచ్చుకుంది. చచ్చీ బతికి 90-100కోట్లకు వెళ్లింది. అంటే యాభై కోట్ల షేరే. మొన్న వచ్చిన `హాయ్ నాన్న` కూడా అంతకంటే తక్కువే చేసింది.
ఇప్పుడు ఈ బడ్జెట్‌తో సినిమా అంటే ఓటీటీ కనీసం ముప్పై, నలభై కోట్లు పలకాలి, అలాగే థియేట్రికల్ బిజినెస్ 70కోట్లు కావాలి. అంటే ఈ మూవీ సుమారు 150కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టాలి. అప్పుడే కొన్న బయ్యర్లు సేఫ్, నిర్మాత సేఫ్. కానీ ఓటీటీ బిజినెస్ దారుణంగా పడిపోయింది. నాని సినిమాలకు కూడా ఓటీటీ డిమాండ్ తక్కువగానే ఉంది. అంత కంటే తక్కువ పలికితే నిర్మాతకు రిస్కే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి దీన్ని ఏం చేస్తారో చూడాలి. ఈ మూవీని సెప్టెంబర్‌లో విడుదలకు ప్లాన్ జరుగుతుందని సమాచారం. మరి ఇది ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.