Supritha with Manchu Lakshmi: మంచు లక్ష్మితో సురేఖవాణి కూతురు, సినిమా చేయబోతున్నారా..?

First Published | May 8, 2022, 8:50 AM IST

మంచు లక్ష్మితో కలిసి కలిసి తెరంగేట్రానికి రెడీ అవుతుంది  క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సుప్రీత, అదే సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసే మంచు లక్ష్మితో కలిసి స్క్రీన్ శేర్ చేసుకోబోతుంది. 
 

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గ్యాప్ లేకుండాసినిమాలు చేసింది సురేఖ వాణి. ఈ మధ్య కొంచెం సినిమాలు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం తన కూతురు సుప్రీతతో కలిసి తెగ సందడి చేస్తుంది. ఇక త్వరలో తన కూతురు ని వెండితెరకు పరిచయం చేయబోతోంది సురేఖ. 
 

క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌  అంతా ఇంతా కాదు.  సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. 


నెట్టింట్లో గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్లు ఇద్దరు తెగ హంగామా చేస్తుంటారు. రకరకాల ఫోటో షూట్ లతో ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ  ఫాలోవర్స్ ను భారీగా పెంచుకుంటుంది సుప్రిత  ఇక త్వరలోనే వెండితెరపై కూడా కనువిందు చేయనుంది. 

ఇప్పటికే సుప్రీత షార్ట్ ఫిలిమ్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేసింది. వీటి ద్వారా పాపులారిటీ సాధించిన బ్యూటీ .. ఇక వెండితెరై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.  కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న మహిళా లోకం  అనే సినిమాలో ఆమె నటించనుంది. 

ఇక ఈసినిమాలో మంచు లక్ష్మీ  మెయిన్‌ లీడ్‌లో నటిస్తుంది. మంచు లక్మీతో కలిసి సుప్రీత స్క్రీన్ శేర్ చేసుకోబోతోంది. దీనికి  సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం  రిలీజ్‌ చేశారు.  

ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియా పేజ్ లో  పోస్ట్ చేసిన మంచు లక్ష్మీ మూవీ టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. ఇక  ఈ సినిమాలో సుప్రీతతో పాటు హరితేజ, హేమ, శ్రద్దాదాస్‌ లాంటి లేడీ స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించబోతున్నారు. 
 

Latest Videos

click me!