Kriti Sanon Action: యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్న కృతీ సనన్, షావోలిన్ ఫైట్స్ ట్రైనింగ్ లో బాలీవుడ్ బ్యూటీ

Published : May 08, 2022, 07:42 AM IST

బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందు వరసలో ఉంటుంది కృతి సనన్.  సునామీ లాంటి సొగసులతో ఆడియన్స్ ను కట్టిపడేసే బ్యూటీ.. ఈసారి యాక్షన్ ట్రీట్ కు రెడీ అవుతోంది. అది కూడా బాలీవుడ్ లో యాక్షన్ కు పెట్టింది పేరైనా టైగర్ ష్రాఫ్ కి పోటీగా యాక్షన్ సీన్స్ ఇరగదీయబోతోంది. 

PREV
17
Kriti Sanon Action: యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్న కృతీ సనన్, షావోలిన్ ఫైట్స్ ట్రైనింగ్ లో బాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ లో వన్ నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం చేసింది కృతి సనన్. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన తరువాత  బాలీవుడ్ చేరిన బ్యూటీ.. అక్కడ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. 

27

ఫిల్మ్ ఇండస్ట్రీకి  ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎవరి వారసత్వం లేకుండా వచ్చిన  కృతి సనన్.. సొంత టాలెంట్ తో నిలబడింది. అంతే కాదు  వరుస విజయాలతో  సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది, చాలా తక్కువ టైమ్ లోనే   స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది కృతి సనన్. 

37

ప్రస్తుతం కృతీ సనన్ చేతిలో  చేతిలో తీరిక లేనన్ని సినిమాలు ఉన్నాయి. గ్యాప్ లేకుండా డేట్స్ ఇస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తోంది బ్యూటీ. రీసెంట్ గా షెహజాదా సినిమా ఫారెన్ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్  చేసుకుని వచ్చింది కృతి. షెహజాదా సినిమా టాలీవుడ్ మూవీ అల వైకుంఠపురములో కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు.

47

ఈ సినిమా షూటింగ్ అయిపోగానే  గణపథ్ మూవీ షూటింగ్ కు రెడీ అయ్యింది కృతీ, బాలీవుడ్ యంగ్ హీరో  టైగర్ ష్రాఫ్‌తో కలిసి కృతి స‌న‌న్‌  గణపథ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్  కోసం లఢక్ వెళ్తున్నారు. ఈ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ లఢక్ వెదర్ లో షూటింగ్ చేయబోతున్నారు. 
 

57

బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్‌కు యాక్షన్ హీరోగా పేరుంది. అయితే ఈ సినిమాలో టైగ‌ర్‌తో పాటు కృతి స‌న‌న్‌ కూడా పోటీ పడుతూ అదిరిపోయే స్టంట్స్ చేయనుంది. ఈ సినిమా కోసం షావోలిన్ ఫైట్స్ నేర్చుకుంటుంది కృతి. హర్ష్ వర్మ అనే షావోలిన్ మాస్టర్ దగ్గర ఆమెకు ఈ స్టంట్స్ నేర్చుకుంటుుంది. 
 

67

ఇక   కృతి టాలెంట్ గురించి షావోలిన్ మాస్టర్  మాట్లాడుతూ…కృతి చెప్పేది బాగా వింటుంది. త్వరగా నేర్చుకుంటుంది. షావోలిన్ ఫైట్స్ నేర్చుకోవడం సహజంగా కష్టం. కానీ కృతి త్వరగా ప‌ర్‌ఫెక్ట్‌గా నేర్చుకుంది అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. గణపథ్ రిలీజ్ అయ్యాక ఆమెను యాక్షన్ క్వీన్ అని పిలుస్తారు అని అన్నారు. 
 

77

ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న కృతి చేతిలో ప్ర‌స్తుతం  ప్రభాస్ ఆది పురుష్, హారర్ డ్రామా బేడియా సినిమాలతో పాటు  దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో ఓ సినిమా చేస్తోంది. టాలీవుడ్ లో మరోసారి డైరెక్ట్ సినిమాకు సై అంటోంది కృతి. 

Read more Photos on
click me!

Recommended Stories