మహేష్ బాబు మైండ్ బ్లాక్ చేసిన ఆముగ్గురు..? సూపర్ స్టార్ ఏం చెప్పారంటే...?

Published : May 07, 2022, 11:37 PM ISTUpdated : May 07, 2022, 11:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ కాంబినేషన్ మూవీ సర్కారువారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తక్కువ మాట్లాడినా.. చాలా ఇంపార్టెంట్ విషయాలను వెల్లడించారు. 

PREV
16
మహేష్ బాబు మైండ్ బ్లాక్ చేసిన ఆముగ్గురు..? సూపర్ స్టార్ ఏం చెప్పారంటే...?

సూపర్ స్టార్ తన పోకిరి సినిమాలో ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో  డైలాగ్ కు సంబంధించి.. తన మైండ్ బ్లాక్ చేసిన ముగ్గరు గురించి యాంకర్ సుమ అడగటంతో  మహేష్  వివరించారు.  డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్,  హీరోయిన్ కీర్తి సురేష్ ఏ సందర్భంలో తన మైండ్ బ్లాక్ చేశారో చెప్పారు సూపర్ స్టార్. 

26

డైరెక్టర్ పరశురామ్ సర్కారువారి పాట కథ చెప్పడంతో పాటు.. ఈసినిమాలో తన క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు, ఆయన విజన్ తన మైండ్ బ్లాక్ చేసేలా చేసిందంన్నారు మహేష్. ఇంత మంచి సినిమా ఇచ్చినందకు పరశురామ్ కు థ్యాంక్స్ చెప్పారు మహేష్. 

36

ఇక హీరోయిన్ కీర్తి సురేష్ ఏ సందర్భంలో మీ మైండ్ బ్లాక్ చేసిందని మహేష్ ను అడగ్గా. తను ఈ సినిమాలో ఎక్ట్సా ఎజర్జీతో చేసిందని.  క్లాస్ హీరోయిన్ లో మాస్ యాంగిల్ చూస్తారని..అలా కీర్తి సర్ ప్రైజ్ చేసి.. తన మైండ్ బ్లాక్ చేసిందన్నారు మహేష్. 
 

46

ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు తనకు చాలా గ్యాప్ వచ్చిందని. ఆయన ఓక్కొక్క పాటతో తన మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడన్నారు మహేష్. ముఖ్యంగా కళావతి పాట విషయంలో క్లాసిక్ ట్యూన్ కదా.. అని డౌట్ రేజ్ చేస్తే.. మీరు చూడండి ఎలా ఉంటుందో అని.. మైండ్ బ్లాక్ అయ్యేలా అది కంపోజ్ చేశారన్నారు మహేష్ బాబు. 
 

56

ఇక మే 12న రిలీజ్ కాబోతున్న ఈసినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్, 14 రీల్స్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళావతి పాట అంతటా..మారు మోగిపోతోంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్. 

66

ఒక్కో డైలాగ్ గట్టిగా పేలడంతో సూపర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. ఇక నుంచి సూపర్ స్టార్ కూడా  వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 

click me!

Recommended Stories