`గూఢచారి 116` మూవీకి మొదట హీరో కృష్ణ కాదు. శోభన్ బాబుని అనుకున్నారు. కానీ జయలలిత తల్లి కారణంగా అందులో హీరో మారిపోయారు. శోభన్ బాబుని చూసి ఏంటి ఇలా ఉన్నాడు, ఈయన పక్కన అయితే మా అమ్మాయి నటించదు అన్నారట.
దీంతో దర్శక, నిర్మాతలు చేసేదేం లేక సెకండ్ లీడ్‌గా ఉన్న కృష్ణని మెయిన్ హీరోగా చేశారు. సోగ్గాడిని సెకండ్ లీడ్‌గా చేశాడు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. దీంతో శోభన్ బాబు స్టార్ కావాల్సింది, కృష్ణ స్టార్ అయిపోయారు.