చిరంజీవి, పవన్‌తో గొడవలు.. ఉదయ్‌ కిరణ్‌ లాగే రోజాకి సినిమా ఛాన్సులు రావా? సీనియర్‌ నటుడు సెన్సేషనల్‌ కామెంట్స్

Published : Apr 19, 2025, 07:34 AM IST

Actress Roja: నటి రోజా మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆమె మంత్రిగానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఓ టీవీ షోస్‌లో మెరిసింది. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అవుతుందట. ఈ నేపథ్యంలో ఆమెకి ఇక సినిమా ఛాన్సులు రావనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.   

PREV
15
చిరంజీవి, పవన్‌తో గొడవలు.. ఉదయ్‌ కిరణ్‌ లాగే రోజాకి సినిమా ఛాన్సులు రావా? సీనియర్‌ నటుడు సెన్సేషనల్‌ కామెంట్స్
Roja-Chiranjeevi

Actress Roja:  నటి రోజు ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌, నాగార్జున ఇలా సీనియర్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

రమ్యకృష్ణ, సౌందర్య, నగ్మా, మీనా వంటి వారికి పోటీగా సినిమాలు చేసి మెప్పించింది. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు తగ్గించింది. అడపాదడపా ఒకటి అర చిత్రాలు చేసింది. కానీ చాలా కాలం జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్ గా వ్యవహరించారు. మంత్రి పదవి వచ్చాక ఆ షోని కూడా వదిలేసింది. 
 

25
Roja-Chiranjeevi

ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేకపోవడంతో రోజా మళ్లీ సినిమాలు చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోజా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసింది. ముఖ్యంగా చిరంజీవిని కొన్ని అనరాని మాటలు అన్నది. అప్పట్లో అవి బాగా చర్చనీయాంశం అయ్యాయి.

మరి ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు అవకాశాలు వస్తాయా? మెగా ఫ్యామిలీతో పెట్టుకుంది ఉదయ్‌ కిరణ్‌ కి ఎదురైన పరిస్థితే రోజా ఫేస్‌ చేయాల్సి వస్తుందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీనియర్‌ నటుడు శివకృష్ణ స్పందించారు. సుమన్‌ టీవీకి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన స్పందించారు. 
 

35
actor shiva krishna (suman tv)

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అవకాశాలు రావు, ఎదగనివ్వరు అని గతంలో రోజా కామెంట్స్ చేసిన నేపథ్యంలో దీనిపై శివకృష్ణ మాట్లాడుతూ,అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. అవకాశాలు రావు అనేదానికి, చిరంజీవికి సంబంధం లేదని తెలిపారు. అదే సమయంలో మరో ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు.

నేను ఒక నిర్మాతగా నా సినిమా బాగా ఆడాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అదే ఉద్దేశ్యంతో సినిమా తీస్తాను. ఇప్పుడు రోజా, పోసాని కృష్ణ మురళీ వంటి వారిని పెట్టుకుంటే.. రేపు థియేటర్లో వాళ్లని చూసి ఆడియెన్స్ రాళ్లు విసిరితే నా పరిస్థితి ఏంటి? తెలివైన నిర్మాత ఎవరూ ఆ సాహసం చేయరు. 
 

45
రోజా

పోసాని కృష్ణ, రోజా రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. కానీ వీళ్లు పర్సనల్‌ ఎటాక్‌ కి వెళ్లారు. ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్తారో, అప్పుడు క్యారెక్టర్‌ పతనం అవుతుంది. పోసాని, రోజా విషయంలో అనే జరుగుతుందేమో అనిపిస్తుంది. వేచి చూడాలి అని తెలిపారు శివ కృష్ణ. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

55
రోజా

రోజా ఇటీవల జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లో ఒక ఎపిసోడ్ కి  మాత్రమే గెస్ట్ గా వచ్చి అలరించింది. ఇప్పుడు మరో షోతో అలరించడానికి వస్తుంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్‌కి రోజా జడ్జ్ గా వ్యవహరించబోతుంది.

ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మరోసారి రోజా తనదైన స్టయిల్‌లో అలరించబోతుందని ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఇలా టీవీకే పరిమితమవుతుందా? సినిమాలు కూడా చేస్తుందా అనేది వేచి చూడాలి. 

read  more: సినిమాల్లోకి రాక ముందు మూవీ స్టూడియోలో చీపురు పట్టిన స్టార్ హీరోయిన్.. బడా నిర్మాత కూతురు అయి కూడా ఆ పని

also read: కోట్ల ఆస్తులు పోగొట్టుకుని 50కి, 100కి అడ్డుకునే పరిస్థితికి దిగజారిన హీరోయిన్.. కారణం అతనే
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories