రజనీకాంత్ కు బట్టతల రావడానికి కారణం ఏంటో తెలుసా? టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన సూపర్ స్టార్ ప్రాణ మిత్రుడు

Published : Jun 20, 2025, 04:33 PM IST

రజినీకాంత్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు.? ఆయన మొదటి అవకాశం ఎలా వచ్చింది? ఎంతో స్టైల్ గా ఉండే రజినీకాంత్ జుట్టు మొత్తం ఊడిపోవడానికి కారణం ఏంటి? రజినీకాంత్ గురించి ఆయన ప్రాణ మిత్రుడు ఏమన్నాడంటే?

PREV
18

సాధారణ బస్ కండక్టర్ నుండి నేడు భారతీయ సినీ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రజినీకాంత్. ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో రజినీకాంత్. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ అసలు సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్. 

ఇద్దరూ కర్ణాటకలో కలిసి పనిచేశారు. అప్పుడు రజినీ స్టైల్, పర్సనాలిటీ చూసి ఆశ్చర్యపోయిన రాజ్ బహదూర్, సినిమాల్లో ప్రయత్నించమని సలహాలు ఇచ్చారట. ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే రజినీ సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం.

28

ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రజినీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు రాజ్ బహదూర్. ఆయన మాట్లాడుతూ: “1970లో రజినీకాంత్ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. నేను డ్రైవర్‌గా చేరాను. మొదటిసారి బస్ లోనే మేము కలుసుకున్నాము. 

ఒకే బస్సులో మా ఇద్దరినీ డ్రైవర్, కండక్టర్‌గా పెట్టారు. అప్పుడు మొదలైన స్నేహం 53 ఏళ్లుగా కొనసాగుతోంది. రజినీకాంత్ ఎంత స్టార్ అయినా సరే.. అప్పుడు ఎలా మాట్లాడుకున్నామో, ఇప్పుడూ అలాగే మాట్లాడుకుంటాం. శరీరం మాత్రమే వేరు, కానీ స్నేహితులుగా మా ప్రాణం ఒక్కటే .

38

మేమిద్దరం డ్రైవర్ కండక్టర్‌గా ఉన్నప్పుడు తరచుగా నాటకాలు వేసేవాళ్లం. అందులో ఇద్దరం నటించేవాళ్లం. ఆ నాటకాల్లో ప్రధాన పాత్రలన్నీ రజినీనే చేసేవాడు. నేను చిన్న చిన్న పాత్రలు చేసేవాడిని. అతను నాటకంలో నటించడం చూసి నేనే ఆశ్చర్యపోయేవాడిని. ఇతను ఇంత బాగా నటిస్తున్నాడు కదా.. ఎందుకు సినిమాల్లో ప్రయత్నించకూడదు అని అనిపించింది. 

అప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లమని వెంటపడటం మొదలు పెట్టాను. నాటకాలు వేసేప్పుడు రజినీకాంత్ నటన చూసి ప్రజలు చప్పట్లు కొట్టి విజిల్ వేసేవారు. అప్పుడే అతను స్టార్ అవుతాడని అనిపించింది. అందుకే సినిమాల్లో నటించడానికి ప్రయత్నించమని అతనితో చెప్పాను. దానికి రజినీ నాకెవరు అవకాశం ఇస్తారు అన్నాడు.

48

నీ ప్రతిభ నీకు తెలియదు, నీ కళ్ళలో ఒక శక్తి ఉంది, అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది, ప్రయత్నించమని చెప్పాను. అప్పుడు ఏం చేయాలి అని నన్ను అడిగాడు. చెన్నైకి వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకో అని చెప్పాను. (అప్పుడు రజినీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది.) నేను అక్కడికి వెళ్లిపోతే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. అప్పుడు నేను కొంచెం స్థితిమంతుడిగా ఉండటంతో, నేను నీ కుటుంబాన్ని చూసుకుంటాను అని చెప్పాను.

58

అతను రెండేళ్లు చదువు పూర్తి చేసుకుని కన్నడలో ఒక నాటకంలో నటించాడు. అప్పుప్పుడు ఆ నాటకానికి స్టార్ డైరెక్టర్ కె. బాలచందర్ వచ్చారు. అప్పుడు రజినీ నటన చూసి ఆశ్చర్యపోయిన బాలచందర్, నాటకం ముగిసిన తర్వాత రజినీకాంత్ ను పిలిచి, నువ్వు తమిళం నేర్చుకో అని చెప్పి వెళ్లిపోయారు. అప్పుడు రజినీకి తమిళం సరిగ్గా రాదు. బాలచందర్ చెప్పిన విషయాన్ని రజినీ నాతో చెప్పాడు. వెంటనే అతనికి తమిళం నేర్పించాలి అనే ఉద్దేశంతో నువ్వూ, నేనూ ఇక తమిళంలోనే మాట్లాడదాం అని చెప్పాను.

68

తర్వాత చిన్నగా అతనికి తమిళం నేర్పించాను. ఒకే నెలలో రజినీకాంత్ అనర్గళంగా తమిళం మాట్లాడటం నేర్చుకున్నాడు. దీని తర్వాత బాలచందర్ దగ్గరికి వెళ్లి అవకాశం అడిగాడు. వెంటనే ఆయన నీకు తమిళం రాదుకదా అన్నారు. అప్పుడు రజినీకాంత్ తమిళంలో అద్భుతంగా మాట్లాడి వినిపించాడు.

రజినీ తమిళం విని బాలచందర్ ఆశ్చర్యపోయారు. తర్వాత అపూర్వ రాగంగళ్ సినిమాలో రజినీకి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో సినిమాలో విలన్ గా అవకాశం ఇచ్చారు బాలచందర్. ఇక ఈక్రమంలోనే రజినీకాంత్ ను నీకు ఏయే స్టైల్స్ తెలుసో అన్నీ సినిమాలో చెయ్యి అని ఫ్రీడం ఇచ్చారు బాలచందర్.

రజినీ కూడా సిగరెట్‌ని నోట్లో పెట్టి స్టైల్ గా పట్టుకోవడం, కళ్లద్దాలను తిప్పి పెట్టుకోవడం వంటివి చేసి.. ఆయన్ను ఆశ్చర్చపరిచాడు. సినిమాలో ఇవన్నీ చూసిన ఆడియన్స్ అప్పుడే రజినీకాంత్ కు ఫిదా అయిపోయారు.

78

ఆ తర్వాత వరుసగా సినిమాలు రజినీకాంత్ ను ముంచెత్తాయి. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు అంటూ.. అభిమానులు పోటెత్తారు. రజినీకాంత్ సినిమాలు ఎలా ఉండేవంటే 24 గంటలూ షూటింగ్ ఉండేది. అంత బిజీగా ఉండేవాడు. ఇలా నటించి నటించి 170 సినిమాలు పూర్తి చేశాడు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి ఎన్నో ఉన్నత అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డుల కంటే తమిళ, తెలుగు ప్రజల మనసుల్లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. దానికంటే ఇంకేం కావాలి.

88

రజినీ కండక్టర్‌గా పనిచేసిన రోజుల్లోనే బాగా స్టైల్ గా ఉండేవాడు. స్టైల్ గా టికెట్లు కొట్టేవాడు, మరీ ముఖ్యంగా హెయిర్ స్టైల్ ను కాస్త కూడా చెరగనిచ్చేవాడు కాదు. బస్సులో ఎంత రద్దీ ఉన్నా చకచకా టికెట్లు ఇచ్చేవాడు. తల వెంట్రుకలు దువ్వుకుంటూనే ఉండేవాడు. 

సిగ్నల్ దగ్గర బస్సు ఆగితే, కిందకి దిగి స్టైల్‌గా నిల్చొని సిగరెట్ తాగేవాడు. అతను తల వెంట్రుకలు ఎక్కువగా దువ్వుకోవడం వల్లనే అన్నీ రాలిపోయాయి. ఇప్పుడు అతనికి బట్టతల రావడానికి కారణం ఇదే. హెయిర్ స్టైల్ చేసి చేసి వెంట్రుకలే లేకుండా పోయాయి. 

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగరెట్‌ని పైకి విసిరి నోట్లో పట్టుకునేవాడు. అది చూసిన ప్రతీ ఒక్కరు షాక్ అయ్యేవారు. నేనేమో అది చూసి జనాలు పిచ్చివాడు అంటారు అని అరిచేవాడిని. కాదులే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అనేవాడు. అలా అతను ఎవరో ఏదో అనుకుంటారు అని చూడకుండా ప్రయత్నించడం వల్లనే నేడు వాటన్నింటినీ తెరపై అలవోకగా చేస్తున్నాడు అని రాజ్ బహదూర్ చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories