ఓ చిత్రంలో చిరంజీవి సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ సూపర్ హిట్ సాంగ్ పాడారు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ ఏంటి ? ఆ సీనియర్ నటి ఎవరు ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. 80 దశకం చివర్లో, 90వ దశకం ప్రారంభంలో చిరంజీవి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలుగా నిలిచాయి. చిరంజీవి, విజయశాంతి కలిసి నటిస్తే బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అన్నట్లుగా అప్పట్లో ఫ్యాన్స్ లో సెంటిమెంట్ ఉండేది.
25
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ
పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందింది. చిరంజీవితో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకుడు కోదండరామిరెడ్డి అనే సంగతి తెలిసిందే. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు.
35
పోటీపడి నటించిన చిరంజీవి, వాణిశ్రీ
ఈ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒక విశేషం అయితే.. చిరంజీవికి అత్త పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ నటించడం మరో విశేషం. చిరంజీవి, వాణిశ్రీ ఈ చిత్రంలో పోటాపోటీగా అద్భుతంగా నటించారు. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం సాగే సన్నివేశాలు ఈ మూవీలో అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రానికి సీనియర్ రచయిత సత్యానంద్ రచయితగా పనిచేశారు. చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు ఆయన రచయితగా వర్క్ చేశారు.
ఒక సందర్భంలో చిరంజీవి.. సత్యానంద్ కి గోల్డ్ నిబ్ ఉన్న పెన్నుని గిఫ్ట్ గా ఇచ్చారట. వీళ్ళిద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఓ ఇంటర్వ్యూలో సత్యానంద్ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో చిరంజీవి మెట్లు దిగుతూ వాణిశ్రీ ని చూసి అల్లరి చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో సత్యానంద్ ఎలాంటి డైలాగ్స్ రాయలేదట. వాణిశ్రీని చూస్తూ చిరంజీవి అల్లరి చేస్తున్నట్లుగా మెట్లు దిగాలి. సన్నివేశంలో అదే ఉంది. ఎలాంటి డైలాగ్ చెప్పకుండా అల్లరిగా కనిపించాలని డైరెక్టర్ తెలిపారు.
కానీ చిరంజీవి మెట్లు దిగుతూ.. వాణిశ్రీని టీజ్ చేస్తూ ఏఎన్ఆర్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి పాడారు. ఆ పాట మరేదో కాదు.. వాణిశ్రీ, ఏఎన్ఆర్ నటించిన బంగారు బాబు చిత్రంలోని 'చెంగావి రంగు చీర' అనే సాంగ్ అది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాణిశ్రీ ఉద్దేశిస్తూ ఆ పాట పాడితే ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అలా చేశారట.
55
అందుకే మెగాస్టార్ అయ్యారు
ఏ సన్నివేశంలో ఏది అవసరమనేది చిరంజీవికి చాలా బాగా తెలుసు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అని సత్యానంద్ తెలిపారు. ఈ మూవీలో కైకాల సత్యనారాయణ, రావు గోపాల్ రావు, గిరిబాబు, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత తమిళంలో రజనీకాంత్, హిందీలో అనిల్ కపూర్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఫాన్స్ లో అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. మరోవైపు విశ్వంభరా చిత్రం కూడా రిలీజ్ కావలసి ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ ఆలస్యం అవుతుండడంతో రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. జానపద కథాంశం, సూపర్ నేచురల్ అంశాలతో దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వశిష్ట చివరగా బింబిసారా చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.