'వేట్టయన్' ట్విట్టర్ రివ్యూ..సూపర్ స్టార్ రజనీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో హైలైట్స్ ఇవే, మూవీ హిట్టా ఫట్టా

First Published Oct 10, 2024, 6:49 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో, లైకా సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ పూర్ ప్రమోషన్స్ కారణంగా ఈ మూవీపై రజనీకాంత్ చిత్రానికి ఉండాల్సిన స్థాయిలో బజ్ లేదు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో, లైకా సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ పూర్ ప్రమోషన్స్ కారణంగా ఈ మూవీపై రజనీకాంత్ చిత్రానికి ఉండాల్సిన స్థాయిలో బజ్ లేదు. మంజు వారియర్ ఈ చిత్రంలో రజనికి జోడిగా నటించారు. ఆమె నటించిన 'అదరగొట్ట వచ్చిండే మనసిలాయో' అనే సాంగ్ మాత్రం బాగా వైరల్ అయింది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. 

అమితాబ్ బచ్చన్ దశాబ్దాల తర్వాత రజనీకాంత్ తో కలసి నటించారు. దగ్గుబాటి రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. దీనితో వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ మొదలయింది. మూవీ చూసిన ఆడియన్స్ ట్విటర్ లో తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. రజనీకాంత్ గత చిత్రాలతో పోల్చితే ఇది డిఫెరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జోనర్ లో సాగుతుందని చెబుతున్నారు. 

Latest Videos


2 గంటల 43 నిమిషాల నిడివితో ఈ చిత్రం ఉంది. ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ గురించి అమితాబ్ బచ్చన్ అధికారులతో చర్చించే సన్నివేశాలతో ఈ చిత్రం మొదలవుతుంది. ఎకౌంటర్ సన్నివేశంతో రజనీకాంత్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్, అమితాబ్ మధ్య సన్నివేశాలు ఉత్కంఠ రేపే విధంగా ఉంటాయి. 

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథని రజనీకాంత్ స్టైల్ లో చూపించాలని టిజి జ్ఞానవేల్ ప్రయత్నించారు. ఇన్వెస్టిగేషన్ కథ అంటే వైవిధ్యం ఉంటుంది. కానీ రజనీకాంత్ సినిమా కాబట్టి కమర్షియల్ అంశాలని కూడానా బ్లెండ్ చేయడానికి ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం జస్ట్ ఒకే అన్నట్లుగా వెళుతూ ఉంటుంది. అక్కడక్కడా మెప్పించే సన్నివేశాలు ఎదురవుతాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ని మాత్రం ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరిగేలా తీర్చి దిద్దారు. 

అనిరుద్ బ్యాగ్రౌండ్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. రజనీకాంత్ సినిమాల్లో ఫ్యాన్స్ కోరుకునే హై మూమెంట్ ఒక్క చోట కూడా ఫస్ట్ హాఫ్ లో లేదు. ఇన్వెస్టిగేషన్ మూవీ కాబట్టి కొన్ని సీన్లు మాత్రం ఉత్కంఠగా అనిపిస్తాయి. రజని ఫ్యాన్స్ మాత్రం ట్విట్టర్ లో మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బావుంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కొందరు ఆడియన్స్ మాత్రం ఇటీవల రజనీకాంత్ నుంచి వచ్చిన డల్ మూవీ ఇదే అంటూ చెబుతున్నారు. 

రజనీకాంత్ ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. రజని క్యారెక్టర్ ని దర్శకుడు బాగా రాసుకున్నారు. అయితే ఈ చిత్రంలో వచ్చే ట్విస్టులు, సన్నివేశాలు ఊహించ దగినవిగా ఉంటాయి అంటూ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.   

ఓవరాల్ గా టిజి జ్ఞానవేల్ ఒక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ కథని రజనీకాంత్ తో డిఫరెంట్ గా ట్రై చేశారు. రజనీకాంత్ స్టైల్ ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. కానీ కమర్షియల్ అంశాలని బలవంతంగా చొప్పించాలని ప్రయత్నించారు. అవి వర్కౌట్ కాలేదు. ఓవరాల్ ఇది యావరేజ్ మూవీ అని, రజనీకాంత్ స్థాయి చిత్రం కాదు అని ఆడియన్స్ అంటున్నారు. 

click me!