#Devara :‘దేవర’కి రిస్క్ చేసిన నాగవంశీకు ఏ మేరకు కలిసొచ్చింది?

First Published | Oct 9, 2024, 9:21 PM IST

దేవర చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు నాగవంశీ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ చేసి మరికొన్ని ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకాలు చేసారు. 

devara, collections, NTR, naga vamsi


ప్రతిష్టాత్మక చిత్రం RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన  పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించిన ఈ చిత్రం మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నా మెల్లిగా పుంజుకుని ఇప్పుడు రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది.

 ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ  నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉన్నా అదంతా పటాపంచలైపోయింది.  సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్  అయిన   దేవర థియేట్రికల్ రైట్స్ అవుట్ రేట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసాడు. ఆయనకు లాభం ఎంత వచ్చిందనే విషయం ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

devara, collections, NTR, naga vamsi


దేవర చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు నాగవంశీ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ చేసి మరికొన్ని ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకాలు చేసారు. రేషియోల వారీగా చుస్తే దేవర ఆంధ్ర ఏరియా ( సీడెడ్ కాకుండా ) రూ. 55 కోట్ల కు సేల్ చేశారు. ఇక తెలంగాణ నైజాం ఏరియాలో రూ. 42 కోట్లు గా నిర్ణయించారు.

ఖర్చులు, జిఎస్టీలు, కమిషన్స్ వీటికి అదనం. నైజాం లో దేవరను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి పంపిణి చేసారు. నెల్లూరు అంజలి పిచ్చర్స్ భాస్కర్ రెడ్డి ( రూ. 5.40 కోట్లు ) , తూర్పు గోదావరి  విజయలక్ష్మి ఫిల్మ్స్ ( రూ. 9.60 కోట్లు ), కృష్ణ ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ ( రూ. 8.40 కోట్లు ) , సీడెడ్ కూడా ధీరజ్ కు ఇచ్చారు రేషియో ఫిక్స్ చేయలేదు. ఇక బాలీవుడ్ లో  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ రూ. 60 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసి విడుదల చేసారు.


Junior NTRs Devara film ticket sale report


 దేవర సినిమాను రెండు తెలుగు రాష్ఠ్రాలకు కలిపి నిర్మాత సుధాకర్, సితార నాగవంశీకి అవుట్ రేట్ కు ఇచ్చేయటమే కలిసి వచ్చింది. అవుట్ రేట్ అంటే ఓ రకంగా రిస్కే. ఎందుకంటే నష్టం వచ్చినా నిర్మాతకు సంభంధం లేదు. అయినా నాగవంశీ సినిమాపై నమ్మకంతో రిస్క్ చేసి లాభాల్లో పడ్డారు.  దసరా సీజ‌న్ లో దేవర   కలెక్షన్లు బాగుండటంతో నైజాం, వైజాగ్, సీడెడ్ ప్రాంతాల నుంచి మంచి ఓవర్ ఫ్లోస్ వస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో బయ్యర్ గా  నాగవంశీకే మంచి లాభం అని తెలుస్తోంది.

ntr, devara, warning, tollywood


నాగవంశీ మొదట ఈ రైట్స్ ప్యాన్సీ రేటుకు తీసుకున్నప్పుడు ఇంత రేటు ఎందుకు పెట్టారని మాట్లాడుకున్నారు. దానికి తోడు మొదటి రోజు డివైడ్ టాక్ రావటం కాస్త ఇబ్బందికి గురి చేసింది. దాంతో ఖచ్చితంగా దేవర నాగవంశీకు లాస్ తెస్తుందని భావించారు. కానీ సినిమా అంతటా ఊహించని విధంగా లాభాల పంట పండిస్తోంది.

తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నాగవంశీ ఈ సినిమాని రిలీజ్ చేసారు. డిస్ట్రిబ్యూటర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. నాగవంశీ అయితే ఫుల్ ఖుషీ అని తెలుస్తోంది.    దసరా  హాలిడేస్  కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.


పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మామూలు స్థితికి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ సోమవారం (11వ రోజు) మార్నింగ్ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ఫలితంగా 11 వ రోజు,12 వ రోజు కూడా  ఈ చిత్రానికి మంచి వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.

అక్టోబర్ 3 నుండి స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు సెలవులు ఇవ్వడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చిన అంశం.  నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.  నైజాం ప్రాంతంలో ఈమధ్య వీకెండ్ తర్వాత వసూళ్లు రావడం చాలా కష్టం అయిపోయింది. కేవలం వీకెండ్స్ మాత్రమే మంచి వసూళ్లు వచ్చేవి. కానీ ‘దేవర’ చిత్రానికి ప్రతీ రోజు వీకెండ్ లో వచ్చిన వసూళ్లే వస్తున్నాయి.

Latest Videos

click me!