గతంలో ఈ టాస్క్ ఆడి ఉన్నారు కాబట్టి.. హౌస్ లో ఉన్న రాయల్ టీమ్ కు ఇది పెద్ద విషయం కాదు. ఇక చూసే జనాలు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. లిమిట్ లెస్ కొత్త టాస్క్ లతో గేమ్స్ ను అద్భుతంగా డిజైన్ చేయొచ్చుు కదా అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ టాస్క్ లో ఎవరి పెర్ఫామెనస్ వారు ఇస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఈ వారం ఎక్కువ మంది నామినేట్ చేసి.. ఎలిమినేషన్ కు దగ్గరలో ఉన్న యష్మి.. తన నటనతో ఆకట్టుకుంటుంది. గేమ్ ను తనదైన శైలిలో ఆడుతూ.. అద్భుతం చేస్తోంది. ఇక యష్మి చేసే పనులు చూస్తూ.. ఇంప్రెస్ అవుతున్నాడు గౌతమ్.
ఇక ఇన్ని రోజులు కమెడియన్స్ లేక చప్పగా సాగిన బిగ్ బాస్ హౌస్ లోకి ముక్కు అవినాశ్ తో పాటు రోహిణి కూడా రావడంతో హౌస్ లో కాస్త కామెడీ జల్లు కురుస్తోంది. ఎన్ని అనుకుంటున్నా.. ఏదో ఒక సందర్భంలో అందరు నవ్వుకుంటూ కాస్త హ్యాపీగా ఉన్నారు. ఇక ఈసారి గంగవ్వలో చాలా మార్పు కనిపిస్తుంది చాలా అంటే చాలా హుషారు అయ్యింది.