ఇక ఈ కంపెనీలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. పెట్టుబడి పెట్టడంతో ఈ కంపెనీ గురించి అంతటా హాట్ టాపిక్ నడుస్తుంది. వారికి మంచి పబ్లిసిటీ కూడా అవుతుంది.
ఇక ఇవే కాదు గతంలో కూడా మహేష్ బాబు రకరాలు వ్యాపారాలు చేసిఉన్నాడు. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణం చేస్తున్నారు.
GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి బిగ్ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తున్న మహేష్.. AMB సినిమాస్ పేరుతో భారీ ఎత్తున మల్టిప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి కావడం విశేషం.