ఈ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని సోనియా ట్రాప్ చేసే వ్యూహం పన్నారన్న వాదన మొదలైంది. కాగా పృథ్వీరాజ్, నిఖిల్ లలో ఒకరితో ఆమె ప్రేమాయణం నడిపే ఆలోచనలో ఉన్నారనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ప్రేమ జంటలకు మైలేజ్ ఎక్కువ. గతంలో పలువురు కంటెస్టెంట్స్ విషయంలో ఇది రుజువైంది. టైటిల్ కొట్టినా, కొట్టకున్నా ఎక్కువ వారాలు హౌస్లో ఉండటం ద్వారా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆర్జించవచ్చు.
ఇక రానున్న రోజుల్లో సోనియా గేమ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆడియన్స్ మాత్రం సోనియా వరస్ట్ కంటెస్టెంట్, ఆమెను ఎలిమినేట్ చేయండంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందనేది బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పే మాట.