superstar krishna
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ దాదాపు ఐదు దశాబ్దాలపాటు సినిమా రంగంలో సేవలందించారు. నటుడిగా రాణించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగానూ మెప్పించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. భోళా శంకరుడిగా అందరి చేత ప్రశంసలందుకున్నారు.
నిర్మాతల పాలిట దేవుడిగా నిలిచారు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణకి అసలు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యమే లేదా? ఇంజనీరింగ్ చేయాలకున్న కృష్ణ.. హీరో ఎలా అయ్యాడు? అసలేం జరిగిందంటే..?
superstar krishna
కృష్ణ చిన్నప్పుడు నటుడిగా మారాలని, సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నారు. తన పేరెంట్స్ అలానే ఆయన్ని గైడ్ చేశారు. కృష్ణని పేరెంట్స్ ఇంజనీర్‌ని చేయాలనుకున్నారు. అందుకోసమే ఎంపీసీలో చేర్పించారు.
సీఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సీ చదువుతున్న సమయంలో ఓ సంఘటన జరిగింది. తన కాలేజీలో ఓ హీరోకి సన్మానం జరిగింది. ఆయన వచ్చినప్పుడు స్టూడెంట్స్ అరుపులు, నినాదాలు, ఆయన కోసం ఎగబడటం చూసి కృష్ణ షాక్ అయ్యారు.
anr
ఒక హీరోకి ఇంత క్రేజ్ ఉంటుందా? అని అప్పుడు అర్థమైంది. అంతే ఆ సంఘటనతో తన ఆలోచన మార్చుకున్నారు. పేరెంట్స్ ఆశలను గల్లంతు చేశారు. సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.
మరి తన కాలేజీకి వచ్చిన హీరో ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు. అప్పటికే ఆయన స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు తెలుగు హీరోలుగా విజయ పతాకం ఎగరేస్తున్నారు.
ntr, superstar krishna
తన కాలేజీ సంఘటనతో కృష్ణ ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏకంగా మద్రాస్ వెళ్లిపోయారు. అక్కడ కొన్ని ప్రయత్నాల తర్వాత ఎన్టీఆర్‌ని కలిశారు.
ఇలా యాక్టింగ్ చేయాలని ఉందని ఆయనకు చెప్పగా, చాలా చిన్న(లేత)గా ఉన్నావ్, రెండేళ్లు ఆగిన తర్వాత రా అని చెప్పారట రామారావు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని సొంతంగా ప్రయత్నాలు చేశారు కృష్ణ.
superstar krishna
1961 మొదటిసారి `కులగోత్రాలు` అనే సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత `పదండి ముందుకు` అనే సినిమాలో కనిపించారు. `పరువు ప్రతిష్ట` సినిమా కూడా బాగానే పేరు తెచ్చింది. కానీ చిన్న చిన్న పాత్రలే తప్ప హీరోగా రాణించే పరిస్థితి లేదు.
దీంతో కొంత గ్యాప్ తీసుకుని హీరోగా ప్రయత్నాలు చేశారు. అలా 1965 లో `తేనే మనసులు` మూవీతో హీరోగా మారారు కృష్ణ. ఆదూర్తి సుబ్బారావు దీనికి దర్శకుడు. ఈ చిత్రం మార్చి 31న విడుదలైంది. దీంతో నేటికి ఈ సినిమా విడుదలై 60ఏళ్లు. అంటే కృష్ణ హీరోగా మారి అరవై ఏళ్లు అని చెప్పొచ్చు.