టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి చాలా కాలం వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మొదట టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది విజయశాంతినే. 1980లో విజయశాంతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయశాంతి కేవలం 14 ఏళ్ళ టీనేజ్ లోనే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.