ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏదో టైమ్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఇప్పటికే ఓ డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది. మళ్లీ మరోసారి ఇది ఉంటుందా? అనేది సస్పెన్స్. ఉంటే మాత్రం ఈ వారం హరితేజతోపాటు, పృథ్వీరాజ్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి.
కానీ ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం ఒక్కరే ఎలిమినేట్ అయ్యేది ఒక్కరే అని టాక్. అది కూడా హరితేజ కాబోతుందని సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం హౌజ్‌లో నిఖిల్, గౌతమ్, యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియా, హరితేజ, తేస్టీ తేజ, అవినాష్, రోహిణి, గంగవ్వ, నబీల్ ఉన్నారు. వీరిలో ఒకరు హౌజ్‌ని వీడబోతున్నారు.
Read more: ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో అనుష్క శెట్టి రహస్య పెళ్లి?.. స్వీటి అంత బాగా చెప్పిన తర్వాత కూడా డౌటా?
also read: సూర్య-జ్యోతిక ఎంత ధనవంతులో తెలుసా?.. సూర్య కంటే జ్యోతికకే ఎక్కువ ఆస్తులున్నాయా?