అట్లీ 'రాజా రాణి' సినిమాలో నటించిన తర్వాత నజ్రియాకు కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 'వాయై మూడి పేసవమ్', 'తిరుమణం ఎనుమ్ నిక్కా', 'నయనడి' వంటి సినిమాల్లో నటించిన నజ్రియా, ఈ నాలుగు సినిమాల తర్వాత సినీ పరిశ్రమ నుండి తప్పుకున్నారు. 2014లో నటుడు ఫహద్ ఫాసిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించలేదు.