మహేష్‌ని అలా, మనవడితో, ఛత్రపతి శివాజీగా.. ఆ కోరికలు తీరకుండానే దివికెగసిన సూపర్‌ స్టార్‌

Published : Nov 15, 2022, 08:14 PM IST

ఏ మనిషి కంప్లీట్‌ గా సంతృప్తి చెందలేదు. తన మనసులో ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. సూపర్‌ స్టార్‌ కృష్ణలోనూ కొన్ని తీరని కోరికలున్నాయి. అవే తలచుకుని అభిమానులు బాధపడుతున్నారు. అయ్యో అభిమాన దేవుడు అసంతృప్తిగానే వెళ్లిపోయారనే ఆవేదన చెందుతున్నారు.  

PREV
15
మహేష్‌ని అలా, మనవడితో, ఛత్రపతి శివాజీగా.. ఆ కోరికలు తీరకుండానే దివికెగసిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు. సినిమా టెక్నాలజీకి సంబంధించిన అనేక కొత్త అంశాలను పరిచయం చేశారు. సాహసాల కృష్ణగా నిలిచిపోయారు. హీరోగా అనేక రకాల పాత్రలు చేశారు. `అల్లూరి సీతారామరాజు`లా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అనేక క్లాసిక్స్ లో ఆయన భాగమయ్యారు. కానీ ఆయనలో కొన్ని తీరని కోరికలు ఉన్నాయి. ప్రధానంగా నాలుగు కృష్ణగారి కోరికలేదు తీరలేదు. 
 

25

మహేష్‌బాబులాంటి ఈతరం సూపర్‌ స్టార్‌ని తెలుగు ఆడియెన్స్ కి అందించారు కృష్ణ. అయితే `టక్కరి దొంగ`లో మహేష్‌ కౌబాయ్‌ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కానీ మహేష్‌ని జేమ్స్ బాండ్‌ పాత్రలో చూడాలనుకున్నారట. గూఢచారిగా ఆయన్ని వెండితెరపై చూడాలనే కోరిక చాలా రోజులుగా ఉంది. అది త్వరలో రాజమౌళితో చేయబోయే సినిమాతో ఫుల్‌ ఫిల్‌ కానుంది. కానీ అది చూడకుండానే వెళ్లిపోయారు కృష్ణ. 

35

మరోవైపు మనవుడు మహేష్‌ తనయుడు గౌతమ్‌తో కలిసి నటించాలని కృష్ణ ఎంతో ఆశపడ్డారట. ఆ కోరిక కూడా తీరలేదు. గౌతమ్‌.. మహేష్‌ నటించిన `వన్‌ నేనొక్కడిడే` చిత్రంలో బాల మహేష్ గా మెరిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా స్టడీస్‌పైనే ఫోకస్‌ పెట్టాడు. దీంతో మనవుడు గౌతమ్‌తో నటించకుండానే దివికెగిసారు సూపర్‌ స్టార్. 
 

45

వీటితోపాటు ఛత్రపతి శివాజీ పాత్రలో నటించాలనేది ఆయన డ్రీమ్‌. ఓ సందర్భంలో ఈ కథపై వర్క్ కూడా చేశారు. అయితే ఇందులో కొన్ని సెన్సిటివ్‌ విషయాలున్నాయి. మతాల మధ్య గొడవలు క్రియేట్‌ అయ్యే అంశాలున్నాయి. అది తీస్తే వివాదంగా మారుతుందనే ముందస్తు ఆలోచనతో ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టారు కృష్ణ. కానీ `చంద్రహాస్‌` సినిమాలో మాత్రం పాటలో ఛత్రపతి శివాజీ గెటప్‌లో మెరవడం విశేషం. 
 

55

మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ గా చేసిన `కౌన్‌ బనేగా కరోడ్ పతి` అనే రియాలిటీ షో ఇండియా వైడ్‌గా ఎంతటి పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. తెలుగులోనూ ఈ షోని రన్‌ చేస్తున్నారు. అయితే ఈ షో కృష్ణకి ఎంతగానో నచ్చిందట. దీన్ని తెలుగులో చేయాలనుకున్నారట. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఆ కోరిక కృష్ణలో మిగిలే పోయింది. తెలుగులో ఈ షోని చేసినప్పటికీ ఆయన్ని ఎవరూ అప్రోచ్‌ కాలేదు. పైగా ఈ షో ప్రారంభానికి కృష్ణ సినిమాల నుంచి దూరమయ్యారు. అడపాదడా గెస్ట్ గా మెరిశారు తప్ప, మెయిన్‌ రోల్‌ చేయలేదు. వయసురీత్యా ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories