సూపర్ స్టార్ కృష్ణ అందరిలాగే సినిమాల కోసం స్ట్రగుల్ అయ్యారు. ఎన్టీ రామారావు వంటి వారి వద్ద తన కోరికని పంచుకున్నారు. కానీ స్వశక్తితోనే ఆఫర్లని సంపాదించాడు. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను నిరూపించుకున్నారు. సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆరు దశబ్దాల పాటు టాలీవుడ్ ని శాషించారు.
కెరీర్ ప్రారంభంలో కృష్ణ లైఫ్ టర్నింగ్ పాయింట్ కావడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ తల్లి కావడం విశేషం. ఆమె దర్శక నిర్మాతలతో ఆరోగెంట్‌గా రియాక్ట్ కావడం వల్లే కృష్ణ కెరీర్ మలుపు తిరిగింది. ఆయనకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ పడింది. కెరీర్‌లో ఫస్ట్ బ్రేక్ దక్కింది. మరి ఆమె ఎవరు? ఆమె ఏమన్నది? కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన సినిమా ఏంటనేది చూస్తే.
సూపర్ స్టార్ కృష్ణ `కులగోత్రాలు`(1961) సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. `పదండి ముందుకు`, `పరువు ప్రతిష్ట` సినిమాలతో అలరించారు. తనలో మంచి నటుడు ఉన్నాడని అందరికి తెలియజేశాడు. `తేనే మనుసులు` సినిమాతో లీడ్ యాక్టర్‌గా మారారు. ఇందులో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండగా, వారిలో ఒకరిగా నటించారు కృష్ణ. ఇది విజయం సాధించింది. కానీ సక్సెస్ ని పంచుకోవాల్సి వచ్చింది. `కన్నేమనసులు` కూడా అంతే.
ఈ క్రమంలో తనని హీరోగా నిలబెట్టిన మూవీ, తాను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసిన మూవీ `గూఢచారి 116`. తెలుగులో వచ్చిన మొదటి స్పై ఫిల్మ్(గూఢచారి) ఇది. ఎం మళ్లిఖార్జున రావు దర్శకత్వం వహించారు. సుందర్‌లాల్, దూండి నిర్మించారు. ఇందులో జయలలిత హీరోయిన్‌గా నటించింది. జయలలిత తల్లి సంధ్య బాగా రిచ్. ఆమెనటి కూడా. జయలలిత హీరోయిన్‌గా తెలుగులో అప్పటికే ఐదారు సినిమాలు చేసింది. అప్పుడప్పుడే స్టార్డమ్ వస్తుంది.
`గూఢచారి 116`లో మొదట హీరో కృష్ణ కాదు. శోభన్‌బాబుని అనుకున్నారు. సైడ్ క్యారెక్టర్ కృష్ణది. ఈ మూవీకి హీరోయిన్‌గా జయలలితని ఫైనల్ చేశారు. ప్రారంభంలో సెట్‌కి ఆమె తల్లి సంధ్య కూడా వచ్చింది. హీరో ఎవరు అంటే శోభన్‌బాబుని చూపించారు. ఆయన ఆ సమయంలో కాస్త జిడ్డు ముఖంతో ఉన్నారు.