అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ముసుగులో Game Changerపైకుట్ర, HD ప్రింట్‌ లీక్‌..సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు

First Published | Jan 13, 2025, 6:14 PM IST

`గేమ్‌ ఛేంజర్‌` సినిమా హెచ్‌ డీ ప్రింట్‌ లీక్‌ చేసిన వారిపై సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు చేసింది టీమ్‌. వీరిలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఉండటం షాకిస్తుంది. 
 

రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ మూవీని ఈ నెల 10న విడుదల చేశారు. సినిమాకి మిశ్రమ స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌ అయిన వెంటనే సినిమా పైరసీ రూపంలో హెచ్‌ డీ ప్రింట్‌ సోషల్‌ మీడియాలో దర్శనమించింది. కొందరు కేటుగాళ్లు ఫ్యాన్స్ ముసుగులో `గేమ్‌ ఛేంజర్‌` సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ని లీక్‌ చేశారు. సినిమాని డ్యామేజ్‌ చేసే ప్రయత్నం చేశారు. 
 

ఈ నేపథ్యంలో తాజాగా సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు చేసింది `గేమ్‌ ఛేంజర్‌` టీమ్‌. సినిమాని సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ చేసిన కొందరు కేటుగాళ్లని గుర్తించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి.

ఈ లీక్‌ చేసిన వారిలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఉండటం గమనార్హం. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ పేర్లతో, వారి సినిమాలతో ఈ సోషల్‌ మీడియా అకౌంట్లు ఉన్నాయి. దీంతో ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్సే ఈ కుట్రలకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. 
 


ఈ కేటుగాళ్లపై సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు సందర్భంగా షాకింగ్‌ విషయాలను పంచుకుంది టీమ్‌. వీరంతా డబ్బులు డిమాండ్‌ చేసినట్టు వెల్లడించింది. ``గేమ్ చేంజర్` విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులకు సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయి.

తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారు. 'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హోచ్‌డి ప్రింట్ లీక్ చేయడమే కాదు, టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు. 
 

'గేమ్ చేంజర్' చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు.

త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పేజీలు అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ పేర్లతో వారి ఫ్యాన్స్ రూపంలో ఉన్నాయి. నిజంగానే ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఈ పని చేశారా? లేక ఫ్యాన్స్ ముసుగులో ఈ కుట్రకు పాల్పడ్డారా? అనేది తెలియాల్సి ఉంది. 
 

Latest Videos

click me!