షూటింగ్స్ లో నాన్ వెజ్ భోజనాలు స్టార్ట్ చేసిన స్టార్ హీరో, ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ ఎవరు పెట్టారో తెలుసా

Published : Jul 29, 2025, 08:39 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ భోజనాల గురించి అందరికి తెలిసిందే. గతంలో ఘూటింగ్ టీమ్ కు వెజిటేరియన్ భోజనాలు పెట్టేవారు. అది కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈక్రమంలోనే  ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ కి నాన్ వెజ్ భోజనాలు పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

PREV
15

ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుతూ వస్తున్న పరిస్థితులు

కాలం మారుతున్నాకొద్ది ప్రతీ విషయంలో మార్పు సహజం. అన్ని రంగాల్లో మార్పులు సహజంగానే వస్తుంటాయి. అలాగే సినిమా రంగంలో కూడా ఇంటువంటి మార్పులే చూస్తున్నాం. ఎన్టీఆర్, ఏన్నార్ కాలంలో షూటింగ్స్ కి, ఇప్పటి సినిమా నిర్మాణాలకు ఎంత తేడా ఉందో చూడవచ్చు. మరీ ముఖ్యంగా షూటింగ్స్ కు టెక్నాలజీని గట్టిగా ఉపయోగిస్తున్నారు. 

అంతే కాదు మూవీ కోసం పనిచేసే ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ తో పాటు చిన్నాచితకా పనివారికి కూడా ప్రోడక్షన్ నుంచి భోజనాలు పెడుతుంటారు. అయితే స్థాయిని బట్టి వారి భోజనం ఉంటుంది. ఒకప్పుడు ఈ విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. స్టార్స్ కు మంచి భోజనమే ఉన్నా.. కింద స్థాయి వారికి మాత్రం నాన్యత లేని భోజనాలు పెట్టేవారట. మహానటి లాంటి సినిమాల్లో ఈ విషయాలను డైరెక్ట్ గానే చూపించారు.

DID YOU KNOW ?
సూపర్ స్టార్ కృష్ణ అరుదైన రికార్డు
సూపర్ స్టార్ కృష్ణ 1972లో ఒకే ఏడాది 18 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు.
25

షూటింగ్స్ లో నాన్ వెజ్ భోజనాలు స్టార్ట్ చేసిన కృష్ణ.

ఈక్రమంలో మూవీ టీమ్స్ కు షూటింగ్ టైమ్ లో వెజిటేరియన్ భోజనాలు పెట్టడమే కష్టంగా భావించే టైమ్ లో, ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారి షూటింగ్స్ లో మాంసాహారభోజనం రుచి చూపించాడు ఓ స్టార్ హీరో. హీరోగా ఎన్ని సినిమాలు చేసినా.. నిర్మాతగా ఆయన అడుగు పెట్టగానే ఇలా సంచల నిర్ణయతో ప్రత్యేకంగా నిలిచారు. ఇంతకీ ఆహీరో ఎవరో తెలుసా? ఎవరో కాదు ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. అవనును కృష్ణ ఏం చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన తెలుగు పరిశ్రమలో ప్రయోగాల కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. టాలీవుడ్ లో చాలా ట్రెండ్స్ కృష్ణ నుంచే స్టార్ట్ అయ్యాయి.

35

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ 

తెలగు పరిశ్రమకు టెక్నాలజీని పరిచయం చేసింది కూడా ఈ హీరోనే. అంతే కాదు తెలుగు తెరను కొత్త పుంతలు తొక్కించి ఎన్నో ప్రయోగాలు చేశారు కృష్ణ. అందులో భాగంగా కృష్ణ నిర్మాతగా పద్మాలయా బ్యానర్ పెట్టగానే, తన సినిమాలకు పనిచేసిన టీమ్ కు షూటింగ్ లో నాన్ వెజ్ భోజనాలు పెట్టడం స్టార్ట్ చేశారు. అంతకు ముందు ఏ షూటింగ్ అయినా వెజ్ భోజనాలు ఉండేవి. అవి కూడా అరకొరగా మాత్రమే పెట్టేవారట. ఇక ఈ విషయాన్ని గతంలో హీరో సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఇంటర్వ్యూలో స్వయంగా సూపర్ స్టార్ కృష్ణ వెల్లడించారు.

45

తెలగు సినిమాచేత కొత్త అడుగులు వేయించిన హీరో

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే చెందుతుంది. ఆయన పరిచయం చేసిన సాంకేతికతలు, సినిమాల్లో ప్రయోగాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. టాలీవుడ్ లో టెక్నికల్‌గా చూస్తే తొలి కలర్ సినిమా, ఫస్ట్ ఫుల్ స్కోప్ మూవీ, తొలి స్టీరియో సౌండ్ టెక్నాలజీ, ఫస్ట్ R/O టెక్నాలజీ సినిమాలు అన్నీ కృష్ణ పరిచయం చేసినవే. టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్ సినిమా కూడా కృష్ణ హీరోగానే చేశారు.

55

టాలీవుడ్ కు టెక్నాలజీ పరిచయం చేసిన సూపర్ స్టార్

అంతే కాదు కలర్ ప్రింట్ కు సబంధించిన టెక్నాలజీ మన దేశంలో లేకపోతే, అమెరికా నుంచి మూడు నెలల ముందు డబ్బులు కట్టి ఆర్డర్ ఇచ్చి మరీ కలర్ ఫ్రింట్ చెప్పించారట సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ఆ ప్రింట్ కోసం దాదాపు రెండు లక్షల పైనే ఖర్చు చేశారట. అందుకే కృష్ణ చేసిన సాహసాలు ఇంకెవరు చేయలేరు అని అంటారు. అంతే కాదు సినిమాల్లో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ ఖాతాలోనే ఉంది అయితే కృష్ణ సినిమాల్లోనే ఇలాంటివి సాధ్యం అయ్యేవి. ఇవే కాకుండా ఆయన సినిమాలు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులెన్నో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories