ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ.. కృష్ణ చేసిన ఫస్ట్ సినిమా ఏదో తెలుసా? రామారావు ఏమన్నాడంటే?

Published : Jan 27, 2026, 12:49 PM IST

ఎన్టీఆర్ - కృష్ణ మధ్య అప్పట్లో ఎన్నో వివాదాలు చెలరేగాయి. సినిమాల పరంగా, రాజకీయంగా కూడా.. ఈ ఇద్దరు హీరోల మధ్య వార్ గట్టిగా నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో ఎన్టీ రామారావు ను టార్గెట్ చేస్తూ.. సూపర్ స్టార్ చేసిన మొదటి సినిమా గురించి మీకు తెలుసా? 

PREV
15
స్టార్ హీరోల మధ్య విభేదాలు

తెలుగు సినిమా తొలి తరం హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలో ఎంత ఆదర్శంగా ఉండేవారో.. వారి మధ్య అంతే విభేదాలు కూడా ఉండేవి. ముఖ్యంగా ఎన్టీఆర్ - ఏఎన్నార్, ఎన్టీఆర్ ‌- కృష్ణ మధ్య పెద్ద పెద్ద యుద్దాలే జరిగాయి. కానీ ఇండస్ట్రీ విషయాలకు వచ్చే సరికి.. కలిసి నిర్ణయాలు తీసుకునేవారు. ఒకరిని మరొకరు గౌరవించుకునేవారు. అక్కినేని ఇవన్నీ ఎందుకని 70వ దశకంలోనే హైదరాబాద్ కు షిప్ట్ అయిపోయారు.

 ఇక ఎన్టీఆర్ కృష్ణ మధ్య అయితే రాజకీయ విభేదాలు కూడా గట్టిగా నడిచాయి. ఈక్రమంలో ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ.. కృష్ణ కొన్ని సినిమాలు కూడా చేశారు. ఎన్టీరామారావు ను ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ.. కృష్ణ చేసిన మొదటి సినిమా ఏదో తెలుసా? ఆ సినిమాకు విజయ నిర్మల దర్శకత్వం వహించిందని మీకు తెలుసా? ఆమూవీ ఏదో కాదు సాహసమే నా ఊపిరి.

25
ఎన్టీఆర్ తో కృష్ణ విభేదాలు..

తెలుగు పరిశ్రమను నిలబెట్టిన మొదటి తరం హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు పేరుంది. ఆతరువాత చాలా కాలానికి ఈ ఇద్దరు హీరోలకు పోటీగా కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ బిగినింగ్ లో ఇబ్బంది పడ్డా.. ఆతరువాత స్టార్ హీరోలుగా గుర్తింపు సాధించారు. 

ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్టీఆర్ కు వీరాభిమానిగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ.. ఆతరువాత చాలా విషయాల్లో ఆయనతో విభేదించారు. సినిమాల పరంగా మాత్రమే కాదు.. రాజకీయంగా కూడా వీరిమధ్య ఉప్పు నిప్పులాగానే పరిస్థితులు మారాయి. ఒక దశలో ఎన్టీఆర్ ను విమర్శిస్తూ.. వరుసగా సినిమాలు కూడా చేశారు కృష్ణ.

35
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు...

అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణకు మధ్య గోడవలు వచ్చాయి. ఆతరువాత చాలా కాలం వారు మాట్లాడుకోలేదు. కొన్నేళ్లకు వీరు కలిసిపోయారు కానీ సినిమాలతో పాటు పొలిటికల్ గా కూడాఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. ఎన్టీఆర్ కు వ్యక్తిరేకంగా కృష్ణ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ.. కృష్ణ చేసిన మొదటి సినిమా సాహసమే నా ఊపిరి. 

ఈసినిమాను కృష్ణ భార్య విజయ నిర్మల డైరెక్ట్ చేసింది. ఈసినిమాలో ఓ పాత్రను ఎన్టీఆర్ వేషధారణలో చూపించారు. ఆయన మ్యానరిజంతో పాటు.. ఆయన ఎం చేస్తున్నారో.. అదే సేమ్ టు సేమ్ దింపేశారు. ఈ ప్లాన్ అంతా విజయ నిర్మల సారధ్యంలోనే జరిగింది.

45
ఎన్టీఆర్ ఏం చేస్తే.. అదే స్క్రిప్ట్..

ఈసినిమాకు సబంధంచిన చాల విషయాలను విజయ నిర్మల గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్ ను విభేదించడానికి కరాణం ఏంటి అని అడిగితే.. విజయ నిర్మల మాట్లాడుతూ.. '' మాకు ఆయనతో ఇబ్బంది లేదు.. కృష్ణగారికి రాజీవ్ గాంధీ అంటే ఇష్టం.. ఆయన పిలిస్తే బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చాక.. పెద్దాయనతో చాలా విషయాల్లో విభేదాలువచ్చాయి. 

ఎన్టీఆర్ ను పోలిన పాత్రను మొదటిసారిగా సాహసమే నా ఊపిరి సినిమాలో పెట్టాము. అందులో నేను స్పెషల్ గా స్క్రిప్ట్ ఏమీ రాయలేదు. పెద్దాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. ఆయన రోజు ఏం చేస్తే.. అదే యాజిటీజ్ గా చూసి, రాసుకుని డైలాగ్స్ రాయమని మహారధికి ఇచ్చేవారము. ఆయన దానికి తగ్గట్టు డైలాగ్స్ రాసేవారు. సినిమా అంతా ఆయన పాత్రఅలానే చేశాము. కొత్తగా నేను చేసింది ఏమీ లేదు'' అని విజయనిర్మల అన్నారు.

55
విజయ నిర్మలతో ఎన్టీఆర్ ఏమన్నారంటే..

కృష్ణ, విజయ నిర్మల కలిసి ఎన్టీఆర్ కు కౌంటర్ గా చాలా సినిమాలు చేశారు. అయినా ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఓ సారి మాత్రం విజయ నిర్మల కనిపిస్తే.. ఎన్టీఆర్ దగ్గరకు రమ్మని పిలిచారట. ఏంటమ్మ ఇక అయిపోయిందా.. నా గురించి చెప్పడానికి, తీయ్యడానికి ఇంకా ఏమైనా మిగిలి ఉందా... అని సరదాగా అడిగారట. మీరు ఏం చేస్తే.. అదే చూపిస్తానండి అని విజయ నిర్మల ధైర్యంగా సమాధానం చెప్పారట. ఈ విషయాన్ని కూడా ఆమె చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories