మెగాస్టార్ చిరంజీవి కి సింగర్ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్, కాస్టింగ్ కౌచ్ పై మళ్లీ మొదలైన రచ్చ..

Published : Jan 27, 2026, 11:32 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై రచ్చ మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని కదిలించగా.. మరోవైపు ఇటువంటి వివాదాల విషయంలో స్పందించడానికి రెడీగా ఉండే చిన్మయి..చిరుకి కౌంటర్ ఇవ్వనే ఇచ్చేసింది.

PREV
16
మళ్లీ మొదలైన కాస్టింగ్ కౌచ్ రచ్చ..

ఫిల్మ్ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో వేదిస్తున్నసమస్యలలో కాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. ఈ విషయంలో ఇదివరకు ఎవరు మాట్లాడకపోయినా.. ఈమధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు తాము ఫేస్ చేసిన వేధింపుల గురించి బహిరంగంగానే చెప్పడం స్టార్ట్ చేశారు. అంతే కాదు ఈ విషయంలో మీటు ఉద్యమం కూడా పరిశ్రమలో నడిచింది. శ్రీరెడ్డి లాంటివారు కాస్టింగ్ కౌచ్ పై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడు ఆ విషయాలు కాస్త మర్చిపోతున్నారు అనుకున్న టైమ్ లో..  చిరంజీవి కామెంట్స్ తో మరోసారి కాస్టింగ్ కౌచ్ రచ్చ మొదలయ్యింది.

26
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ తో మొదలు..

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చకు దారి తీశాయి. సినిమా ఇండస్ట్రీ అనేది అద్దంలాంటిది, మనం ఎంత నిబద్ధతతో పనిచేస్తే అంతే ఫలితం తిరిగి వస్తుంది. అవకాశాల కోసం తప్పుదారులు తొక్కాల్సిన అవసరం లేదని, కమిట్‌మెంట్‌తో పనిచేయడమే ముఖ్యమని, కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అన్నట్టుగా మెగాస్టార్ మాట్లాడారు. ఇండస్ట్రీ అద్భుతంగా ఉంది కాబట్టి.. తెలుగు అమ్మయిలు ఇండస్ట్రీకి రావాలని చిరు కోరారు. నాకూతురు సుస్మిత, అశ్వినీ దత్ కుమార్తెలు కూడా ధైర్యంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. అని చిరంజీవి అన్నారు.

36
చిరంజీవికి చిన్మయి కౌంటర్..

చిరంజీవి చేసిన కామెంట్స్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇలాంటి విషయాల్లో స్పందించడానికి ముందుండే వ్యక్తుల్లో సింగర్ చిన్మయి ఒకరు. మెగాస్టార్ కామెంట్స్ కు సింగర్ చిన్మయి ఘాటుగానే స్పందించింది. చిన్మయి ఇలా రాసుకొచ్చింది '' ఇండస్ట్రీలో “కమిట్‌మెంట్” అనే పదానికి వాస్తవ పరిస్థితుల్లో వేరే అర్థాలు ఉన్నాయి..ముఖ్యంగా మహిళల విషయంలో అవకాశాలు రావాలంటే అనేక అవమానాలు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది'' అని ఆమె తన పోస్టులో చిన్మయి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో తాను చూసిన, విన్న కొన్ని సంఘటనలను ఆమె ప్రస్తావించారు.

46
వేధింపులు తప్పడంలేదు..

చిన్మయి స్పందిస్తూ.. ఒక ఫిమేల్ మ్యూజిషియన్ స్టూడియోలో ఎన్నో వేధింపులు ఫేస్ చేసి.. చివరకు ఆ రంగాన్ని పూర్తిగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు పురుషులు మహిళలను లైంగికంగా ఇబ్బంది పెట్టడం, ఆ ప్రవర్తనకు సమాజంలో ఎవరు మాట్లాడకపోవడం.. మౌన సమ్మతి లభిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులు మహిళలకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని చిన్మయి అభిప్రాయపడింది.

56
చిన్మయి ఎదుర్కొన్న వేధింపులు..

తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ప్రస్తావించిన చిన్మయి.. " ప్రముఖ గీత రచయిత వైరాముత్తుతో సంబంధించి గతంలో నేను చేసిన ఆరోపణ కట్టుబడి ఉంటాను. ఆయన నన్ను వేధించాడు. ఇలాంటి ఘటనలు ఒక్కరివి కాదు.. ఇండస్ట్రీలో చాలా మందికి ఇవి తెలిసిన నిజాలే. బాధితులకే తప్పు అంటగట్టే ధోరణి కూడా బాధాకం.. కొన్నిసార్లు సీనియర్లు కూడా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని'' చిరంజీవి కామెంట్స్ కు కౌంటర్ గా అన్నారు. .

66
అద్దంలాంటి మాటలతో కప్పిపుచ్చలేము..

చిరంజీవి తరం వేరు, అప్పటి పరిస్థితులు కూడా వేరుగా ఉండేవని అంగీకరిస్తూనే, ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను “అద్దంలాంటి” మాటలతో కప్పిపుచ్చలేమని చిన్మయి స్పష్టం చేశారు. అవకాశాల పేరుతో లైంగిక ఆశలు పెట్టుకునే పురుషులే అసలు సమస్య అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కామెంట్లు.. కౌంటర్లతో మరోసారి కాస్టింగ్ కౌచ్ రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇది ఎక్కడివరకూ వెళ్తుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories