నువ్వు తినే తిండి కాదు.. నీ మనసు వెజిటేరియన్ గా ఉంటే చాలు. మనసులో కుట్రలు, కుళ్ళు పెట్టుకుని వెజిటేరియన్ అంటే సరిపోదు. నీ శరీరం మొత్తం నాన్ వెజ్ కదా.. ఒక్కరోజు నాన్ వెజ్ తిననంత మాత్రాన నీ శరీరం వెజిటేరియన్ అయిపోదు. మనసులో అందరికి మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. అదే వెజిటేరియన్. ఆహారం విషయంలో ఇలాంటి నియమాలు వద్దు. పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు మాంసం తినొద్దు. అంతవరకు పాటించు చాలు అని అన్నారు. రజనీకాంత్ చెప్పిన మాటలతో తాను మారిపోయానని సుమన్ అన్నారు. అప్పటి నుంచి శనివారం కూడా మాంసం తింటానని చెప్పారు.