డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఐదేళ్ల క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని తెరకెక్కించారు. ఈ చిత్రంపై మాస్ ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ పోతినేని క్యారెక్టర్ ని పూరి మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీర్చి దిద్దారు.