Published : Nov 28, 2023, 01:09 PM ISTUpdated : Nov 28, 2023, 01:22 PM IST
నమ్రత శిరోద్కర్ విషయంలో ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే. ఆమె గ్లామర్ అంతకంతకు ఇనుమడిస్తుంది. నమ్రత లేటెస్ట్ లుక్ సో యంగ్ గా ఉంది. అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి ప్రస్తుత వయసు 51 ఏళ్ళు. బహుశా ఈ వాస్తవం జనాలు నమ్మకపోవచ్చు. ఆమె అందం అలాంటిది మరి. నమ్రత ఐదు పదుల వయసు దాటేసిందంటే ఆశ్చర్యం వేస్తుంది. మహేష్ కంటే వయసులో పెద్దదైన నమ్రత భర్తకు పోటీ ఇస్తుంది.
27
Namrata Shirodkar
నమ్రత ఫిట్నెస్ అండ్ గ్లామర్ కి ఆమె లైఫ్ స్టైల్ కారణం. నమ్రత రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంది. డైట్ ఫాలో అవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటుంది. ఆమె బ్యూటీ రహస్యం ఇదే.
37
Namrata Shirodkar
ఇక మహేష్ బాబు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. విరామం దొరికితే కుటుంబ సభ్యులతో విదేశాలకు చెక్కేస్తారు. అమెరికా, ఫ్రాన్స్, దుబాయ్ దేశాలకు విరివిగా వెళుతుంటారు. ఇప్పటికే దాదాపు ప్రపంచాని చుట్టేసింది మహేష్ ఫ్యామిలీ.
47
Namrata Shirodkar
నమ్రతను మహేష్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2005లో అత్యంత నిరాడంబరంగా మహేష్ బాబు-నమ్రతల వివాహం జరిగింది. మహేష్ తండ్రి కృష్ణకు ఈ పెళ్లి ఇష్టం లేదనే వాదనలు వినిపించాయి.
57
Namrata Shirodkar
పెళ్ళైన వెంటనే నమ్రత నటనకు గుడ్ బై చెప్పింది. ఆమె గృహిణిగా మారిపోయింది. పిల్లలు గౌతమ్, సితారలను పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకుంది. కొన్నాళ్లుగా మహేష్ వ్యక్తిగత సలహాదారుగా ఆమె వ్యహరిస్తున్నారు.
67
మహేష్ బాబు సంపాదన వివిధ పరిశ్రమల్లో పెట్టుబడి పెడుతుంది. వ్యాపారాలు చేస్తుంది. టాలీవుడ్ బెస్ట్ కపుల్ మహేష్-నమ్రత అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లుగా మహేష్, నమ్రత అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు.
77
తెలుగులో నమ్రత అంజి, వంశీ చిత్రాల్లో నటించింది. మోడల్ గా నటిగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి ఆమె దూరమయ్యారు. ముంబైలో పుట్టి పెరిగిన నమ్రత తెలుగింటి కోడలిగా అడ్జస్ట్ కావడం గొప్ప పరిణామం...