మహేష్ బాబు మొబైల్ వాల్ పేపర్ ఏమిటో తెలుసా? నమ్రత, సితార, కృష్ణ, గౌతమ్ ఫోటో కాదు!

First Published | Nov 17, 2024, 12:01 PM IST

మహేష్ బాబు తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్న ఫోటో ఏమిటో తెలిస్తే షాక్ అవుతున్నారు. భార్య, పిల్లలు, తండ్రి ఫోటో కాకుండా ఎవరూ ఊహించని ఫోటో ఆయన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. 
 

స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ వేరు. అభిమానులు వారిని దేవుళ్ళకు మించి పూజిస్తారు. వారికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. వారిని అనుకరిస్తారు. తమ అభిమాన హీరో ఏం తింటారు? ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు? ఆయన డ్రెస్సింగ్ ఏమిటీ? లైఫ్ స్టైల్? హాబిట్స్? ఫిట్నెస్ సీక్రెట్స్.. ఇలా ప్రతి విషయం తెలుసుకోవాలని అనుకుంటారు. 
 

ఇక మహేష్ బాబు అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తారు. కాగా మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో మాత్రం ఆయన చాలా యాక్టీవ్. బయట అరుదుగా కనిపిస్తారు. తన మూవీ ప్రమోషన్స్ లేదా బ్రాండ్ ప్రమోషన్స్ కోసమే ఆయన మీడియా ముందుకు వస్తారు. 
 



ఖాళీ సమయం దొరికితే ఆయన కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతారు. ప్రతి ఏడాది ఐదారు ఫారిన్ ట్రిప్స్ కి భార్య పిల్లలతో వెళతారు. మహేష్ బాబు ప్రేమించినంతగా కుటుంబాన్ని మరొక హీరో ప్రేమించడేమో. మరి అంతగా కుటుంబాన్ని ప్రేమించే మహేష్ బాబు మొబైల్ వాల్ పేపర్ మాత్రం చాలా భిన్నంగా ఉంది. తాజాగా మహేష్ బాబు మొబైల్ వాల్ పేపర్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. 

మహేష్ బాబు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ఆయన మొబైల్ వాల్ పేపర్ గా ఫ్యామిలీ ఫోటో లేదా పిల్లలు సితార, గౌతమ్ ల ఫోటో ఉంటుందని భావిస్తాము. లేదా నమ్రత లేదంటే ఆయన ఆరాధించే తండ్రి కృష్ణ ఫోటో ఉంటుందని అనుకుంటాము. కానీ మనందరి అంచనాలు తప్పు. మహేష్ బాబు మొబైల్ వాల్ పేపర్ గా ఎర్త్ ఫోటో పెట్టుకున్నారు. సదరు గ్లోబ్ ఫోటోలో భారత్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. 


మహేష్ బాబు భూగోళాన్ని తన వాల్ పేపర్ గా పెట్టుకోవడం వెనుక కారణం ఏమిటో తెలియదు. మరోవైపు ఆయన ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల రాజమౌళి లొకేషన్స్ ఎంపిక చేసేందుకు కెన్యా దేశం వెళ్లారు. అక్కడ వైల్డ్ సఫారీ చేశారు. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాజమౌళి అడవులను జల్లెడ పడుతున్నాడు. 

ఎస్ఎస్ఎంబి 29 వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందట. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా నిర్మించనున్నారు. ఇక మహేష్ ఈ చిత్రంలో సరికొత్తగా దర్శనం ఇవ్వనున్నాడు. ఆయన లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. రాజమౌళి తన హీరోలను గత చిత్రాలకు భిన్నంగా చూపిస్తారు. మహేష్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి నెలకొంది.

Latest Videos

click me!