మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా కేజర్..ఆమె అందానికి ప్రపంచం ఫిదా

First Published | Nov 17, 2024, 11:20 AM IST

2024 మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత ప్రకటన జరిగింది. ఈసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా కేజర్ కైవసం చేసుకుంది. ఆమె పూర్తి పేరు విక్టోరియా కేజర్ తెల్విగ్.

2024 మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత ప్రకటన జరిగింది. ఈసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా కేజర్ కైవసం చేసుకుంది. ఆమె పూర్తి పేరు విక్టోరియా కేజర్ తెల్విగ్. 21 ఏళ్ళ వయసులో మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. గత ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన అమెరికన్ మోడల్ షెన్నిస్‌ పలాసియోస్‌ చేతుల మీదుగా విక్టోరియా తన కిరీటాన్ని అందుకుంది. 

మెక్సికోలో మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫినాలేలో విక్టోరియా కేజర్ తో పాటు.. మెక్సికోకి చెందిన మరియా ఫెర్నాండ, నైజీరియాకి చెందిన చిడిమ్మ ఆడెట్శిన, థాయిలాండ్ కి చెందిన సచతా చుంగ్శ్రీ , వెనుజులకి చెందిన ఇలియానా మార్కిజ్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. 


ఈ ఐదుగురు విజేతను డిసైడ్ సి చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ సెషన్ లో పాల్గొన్నారు. చివరికి మిస్ యూనివర్స్ కిరీటం విక్టోరియాకి దక్కింది. మిస్ యూనివర్స్ పేజెంట్ విజేత ప్రకటన రాగానే విక్టోరియా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్ సెర్చ్ మొదలుపెట్టారు. 

గ్రాండ్ ఫినాలేలో విక్టోరియా బ్రైట్ పింక్ కలర్ లాంగ్ గౌన్ ధరించి అందంగా మెరిసింది. ఆమె ఫోటోలు చూస్తున్న వారంతా విక్టోరియా మిస్ యూనివర్స్ కిరీటానికి 100 శాతం అర్హురాలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. 2024 మిస్ యూనివర్స్ పేజెంట్ పోటీల్లో మొత్తం 125 మంది మోడల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో విక్టోరియా మాత్రమే విజేతగా నిలిచింది. 

ఇక ఇండియాకి చెందిన అహ్మదాబాద్ మోడల్ రిహా సింగా కూడా మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొన్నారు. ఈ యంగ్ బ్యూటీ టాప్ 30 వరకు చేరుకోగలిగింది. కానీ తర్వాతి రౌండ్ లో టాప్ 12 కి చేరుకోలేకపోయింది. దీనితో రిహా సింగకి అవకాశం చేజారింది.  

Latest Videos

click me!