క్లాస్ మేట్ ని ప్రేమించి దగ్గరుండి పెళ్లి చేసిన మెగా హీరో..ఈసారి ఫారెన్ అమ్మాయితో లవ్, నిండా మునిగిపోయాడు

First Published | Nov 17, 2024, 10:31 AM IST

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు గట్రా జరుగుతూనే ఉంటాయి. కొంత మంది లవ్ లో సక్సెస్ అయి వివాహం కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో గాఢంగా ప్రేమించినప్పటికీ లవ్ లో ఫెయిల్ అయిన సెలెబ్రిటీలు కూడా ఉన్నారు.

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు గట్రా జరుగుతూనే ఉంటాయి. కొంత మంది లవ్ లో సక్సెస్ అయి వివాహం కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో గాఢంగా ప్రేమించినప్పటికీ లవ్ లో ఫెయిల్ అయిన సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోల్లో కూడా లవ్ స్టోరీలు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ముందుంటారు. 

సాయిధరమ్ తేజ్ తన లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ గురించి గతంలో ఓపెన్ అయ్యాడు. సాయిధరమ్ తేజ్ మనసులో ఉన్న విషయాలని ఓపెన్ గా చెప్పేస్తారు. చాలా మంది పర్సనల్ విషయాలని బయటపెట్టడానికి ఒప్పుకోరు. కానీ తేజు చాలా విషయాలని అంత సీరియస్ గా పట్టించుకోడు. ప్రేమని సీరియస్ గా తీసుకోవడం వల్లే నిండా మునిగిపోయానని తేజు తెలిపాడు. 


ఇంతకీ సాయిధరమ్ తేజ్ లైఫ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. డిగ్రీలో ఉన్నప్పుడు తన క్లాస్ మేట్ ని తేజు చాలా డీప్ గా లవ్ చేశాడట. ఆ అమ్మాయి కూడా తనని ప్రేమించినట్లు తేజు తెలిపాడు. అయితే ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. ఆమెతో లవ్ కొనసాగించడం వీలు పడలేదు. దగ్గరుండి మరో అమ్మాయితో ఆమె వివాహం చేసి పంపించాల్సి వచ్చింది అంటూ సాయిధరమ్ తేజ్ తెలిపాడు. నా ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ అదే. 

మరోసారి ఫారెన్ అమ్మాయిని ప్రేమించాను అని తేజు తెలిపారు. ఆమె ఎవరో కాదు.. తనతో కలసి తిక్క చిత్రంలో నటించిన బ్రెజిల్ బ్యూటీ లారిస్సా బోనేసి. ఆమె యాటిట్యూడ్, బిహేవియర్ కి తేజు అట్రాక్ట్ అయ్యాడట. ఆమెని ప్రేమించి కచ్చితంగా వివాహం చేసుకోవాలని అని తేజు డిసైడ్ అయ్యాడు. ఒక రోజు షూటింగ్ సమయంలో ఆమెకి తేజు ప్రపోజ్ చేశాడట. 

దీనితో లారిస్సా చాలా పద్దతిగా. సారీ తేజు.. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నిన్ను లవ్ చేయలేను అని  చెప్పేసింది. ఆ టైంలో తన హార్ట్ బ్రేక్ అయినట్లు అనిపించింది అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. అప్పటి నుంచి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లదలుచుకోలేదు అని తేజు తెలిపాడు. 

Latest Videos

click me!