మహేష్ బాబు ఆ సినిమా చేయకుండా అడ్డుకునేవాడిని..హిట్ మూవీని సూపర్ స్టార్ కృష్ణ ఎందుకు ఆపేయాలనుకున్నారు ?

Published : Nov 14, 2025, 10:02 AM IST

ఓ చిత్రంలో మహేష్ బాబు నటించకుండా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అడ్డుకోవాలనుకున్నారట. కృష్ణ ఆపాలనుకున్న ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మహేష్ బాబు కెరీర్ లో ఫ్లాపులు 

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్ కొంత తడబాటుకు గురైంది. రాజకుమారుడు మూవీ మంచి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ లాంటి చిత్రాలు నిరాశ పరిచాయి. మధ్యలో మురారి బాగా ఆడింది. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాపులు ఎదురయ్యాయి. తండ్రికి చెప్పకుండా మహేష్ బాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొంప ముంచాయి. 

25
తండ్రికి చెప్పకుండా మహేష్ చేసిన మూవీ 

మహేష్ బాబు కెరీర్ లో డిజాస్టర్ చిత్రాల్లో నాని ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ కథని మహేష్ బాబు కృష్ణకి చెప్పలేదట. తండ్రికి చెప్పకుండా ఈ మూవీలో నటించడానికి మహేష్ రెడీ అయ్యాడు. ఇది ప్రయోగాత్మక కథ. చిన్న పిల్లాడు పెద్దవాడిగా అయిపోయే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. నాని మూవీ 2004లో విడుదలై అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. 

35
అడ్డుకోవాలనుకున్న కృష్ణ 

విచిత్రం ఏంటంటే ఈ మూవీ తమిళంలో మంచి హిట్ గా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ నాని మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మహేష్ నాకు చెప్పకుండా ఈ సినిమాలో నటించాలని డిసైడ్ అయ్యాడు. కథ నాకు తెలిసి ఉంటే కచ్చితంగా సినిమా ఆపేసేవాడిని. ఎందుకంటే మహేష్ లాంటి స్టార్ కి ఆ కథ సెట్ కాదు. స్టార్ కాకుండా వేరే హీరో ఎవరైనా నటిస్తే ఆ సినిమా బావుంటుంది. అందుకే తమిళంలో ఆ చిత్రం హిట్ అయింది అని కృష్ణ అన్నారు. 

45
తమిళంలో హిట్ 

తమిళంలో దర్శకుడు ఎస్ జె సూర్యనే హీరోగా నటించారు. అందుకే అక్కడ హిట్ అయింది అని కృష్ణ తెలిపారు. అతిథి తర్వాత మహేష్ బాబు మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు. కెరీర్ లో అలా గ్యాప్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని కృష్ణ తెలిపారు. 

55
ఇప్పటికీ ఆ సాంగ్ వైరల్ 

నాని మూవీలో మహేష్ బాబుకి జోడీగా అమీషా పటేల్ నటించారు. మహేష్ బావ సంజయ్ స్వరూప్, రఘువరన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ మూవీలో 'పెదవే పలికిన మాటల్లోన్నే తీయని మాటే అమ్మ' అనే సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూనే ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories