మహేష్ నటించిన ఆ మూవీ ఫ్లాప్ అంటే కృష్ణ ఒప్పుకోరు, కావాలనే నెగిటివ్ ప్రచారం.. అలా ఎందుకు జరిగిందంటే

First Published Jul 3, 2024, 3:19 PM IST

కథల ఎంపిక విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో తండ్రి కృష్ణ తోడ్పాటు ఉన్నప్పటికీ ఆ తర్వాత మహేష్ సొంతంగా కథలు వినడం ప్రారంభించారు.

Mahesh Babu

కథల ఎంపిక విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో తండ్రి కృష్ణ తోడ్పాటు ఉన్నప్పటికీ ఆ తర్వాత మహేష్ సొంతంగా కథలు వినడం ప్రారంభించారు. ఒక్కడు చిత్రంతో  స్టార్ అయిన మహేష్ బాబు పోకిరి చిత్రంతో టాలీవుడ్ సూపర్ స్టార్ గా మారిపోయారు. 

త్వరలో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సాధించిన ప్రతి విజయాన్ని తండ్రిగా కృష్ణ గర్వపడుతూ వచ్చారు. మహేష్ నటించిన చిత్రాల రికార్డులని కృష్ణ స్వయంగా చెప్పేవారు. అంతబాగా మహేష్ సక్సెస్ ని కృష్ణ గుర్తు పెట్టుకున్నారు. 

Latest Videos


అదే విధంగా మహేష్ ఏదైనా ఫ్లాప్ మూవీలో నటిస్తే కృష్ణ తన ఒపీనియన్ ఓపెన్ గా చెప్పేవారు. ఉదాహరణకి మహేష్ నటించిన నాని చిత్రం కృష్ణకి నచ్చలేదు. ఈ సినిమా రిలీజ్ కి ముందే కృష్ణ ఆ విషయం చెప్పారు. ఈ మూవీ కనుక హిట్ అయితే మహేష్ స్టార్ హీరో కాలేడు అని ఓపెన్ గా చెప్పేశారు. అంటే స్టార్ హీరోలు ఇలాంటి చిత్రాల్లో నటించకూడదు అనేది కృష్ణ అభిప్రాయం. 

అదే విధంగా కొన్ని చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ లేదు ఈ సినిమా బావుంది అని కృష్ణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సర్కారు వారి పాట చిత్రం రిలీజ్ అయినప్పుడు చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం గురించి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సర్కారు వారి పాట చిత్రం ఫ్లాప్ అంటే తాను ఒప్పుకోను అని అన్నారు. 

సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఒక యూనిక్ విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రంలో చూపించిన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి సుప్రీం కోర్టులో కూడా చర్చ జరుగుతోంది అని కృష్ణ అన్నారు. పోకిరి, దూకుడు చిత్రాలకంటే ఈ చిత్రంలో మహేష్ బాబు పెర్ఫామెన్స్ చాలా ఎనెర్జిటిక్ గా ఉంది అని కృష్ణ అన్నారు. 

అన్ని సెంటర్స్ లో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అని కృష్ణ అన్నారు. కానీ కొందరు కావాలనే నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నట్లు కృష్ణ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే సర్కారు వారి పాట చిత్రం మహేష్ హిట్ చిత్రాలతో పోల్చితే గొప్పగా వసూళ్లు రాబట్టలేకపోయింది. 

click me!