శంకర్‌ దర్శకత్వంలో రజనీ, కమల్‌ కాంబో మూవీ.. వర్కౌట్‌ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

First Published Jul 3, 2024, 1:47 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ప్లాన్‌ చేశారు దర్శకుడు శంకర్‌. కానీ అది వర్కౌట్‌ కాలేదు. ఎందుకు ఆగిపోయింది? అసలేం జరిగిందనేది చూస్తే..

Director Shankar

శంకర్‌ ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. కానీ ఆయన ముప్పై ఏళ్ల క్రితమే అలాంటి సినిమాలు చేశారు. `భారతీయుడు`, `ఒకే ఒక్కడు`, `అపరిచితుడు`, `శివాజీ`, `రోబో` చిత్రాలు ఆ కోవకి చెందిన సినిమాలే. అప్పట్లోనే ఇవి సంచలనాలు సృష్టించాయి. తమిళంలో మాత్రమే కాదు, ఇతర భాషల్లోనూ డబ్‌ అయి రికార్డులు సృష్టించాయి.  

Shankar

రజనీకాంత్‌తో `శివాజీ`, `రోబో`. `2.0` చిత్రాలు చేశారు శంకర్‌. `భారతీయుడు` తర్వాత ఇప్పుడు `భారతీయుడు 2`, `భారతీయుడు 3` చిత్రాలను రూపొందించారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ సినిమాఉల విడుదల కాబోతున్నాయి. ఈ నెల 12న `భారతీయుడు 2` విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు శంకర్‌. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో సినిమాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఆయన సినిమాని ప్లాన్‌ చేసినట్టు తెలిపారు. 


నిజానికి రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో `2.0` సినిమా చేయాలనుకున్నారట శంకర్‌. రజనీకాంత్‌ రోబోగా, నెగటివ్‌ రోల్‌లో కమల్‌ హాసన్‌ని అనుకున్నారట. అక్షయ్‌ కుమార్‌ చేయాల్సిన పాత్రని ముందుగా కమల్‌ తోనే అనుకున్నట్టు తెలిపారు. ప్రారంభంలో చర్చలు జరిగాయని, ఆ సమయంలో కమల్‌ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో అది వర్కౌట్‌ కాలేదని తెలిపారు. దీంతో అక్షయ్‌ కుమార్‌ని తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. `భారతీయుడు 2` ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు శంకర్‌. 
 

Kamal

మరి మున్ముందు ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్‌ కనగరాజ్‌కి సాధ్యమని చెప్పొచ్చు. ఆయన తన సినిమాటిక్‌ యూనివర్స్ లో భాగంగా కార్తీతో `ఖైదీ`, కమల్‌తో `విక్రమ్‌`, విజయ్‌తో `లియో` చిత్రాలను చేశారు. ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ` సినిమా చేస్తున్నారు. లోకేష్‌సినిమాటిక్‌ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రం రూపొందుతుంది. ఇవన్నీ ఓ చోట కలిసే అవకాశం ఉంది. అంటే ఈ పాత్రలన్ని ఫైనల్‌గా కలవబోతున్నాయని తెలుస్తుంది. అదే జరిగితే కార్తీ, కమల్‌, విజయ్‌, రజనీల కాంబినేషన్‌లో సినిమా అంటే ఇండియన్‌ సినిమా షేక్‌ కావడం ఖాయం. మరి ఇది జరుగుతుందా? లోకేష్‌ మనసులో ఏముందనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే కమల్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో `అపూర్వ రాగంగల్‌`, `16 వయథినిలే`, `అవ్‌ అప్పదిథాన్‌`, `అవర్గల్‌`, `ఆడు పులి అథమ్‌`, `మూండ్రు ముడిచు`, `నినైతలేఇనిక్కుమ్‌`,  `గిరాఫ్తార్‌` వంటి చిత్రాలు వచ్చాయి. తమిళంలో మంచి ఆదరణ పొందాయి. వీర కాంబినేషన్‌లో సినిమా వచ్చి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతుంది. 

 శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `భారతీయుడు  2`లో కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్నారు. సేనాపతిగా మరోసారి సందడి చేయబోతున్నారు. విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో లేదనే టాక్‌ ఉంది. ఇందులో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తోపాటు ఎస్‌ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 12న ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. మరి 1996లో వచ్చిన `భారతీయుడు` రేంజ్‌లో ఆకట్టుకుంటుందా ? అనేది చూడాలి. 
 

click me!