సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ అంటే ఓ హిస్టరీ... బర్త్ డే సందర్భంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అరుదైన విజయాలు!

Published : May 31, 2022, 11:40 AM IST

బుర్రిపాలెం అనే ఓ చిన్న పల్లెటూరిలో పుట్టిన కృష్ణ సూపర్ స్టార్ గా తెలుగు చలన చిత్ర రంగంలో చరిత్ర సృష్టించారు. డేరింగ్ డాషింగ్ హీరోగా అపురూప విజయాలు అందుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా విజయం సాధించి ఎందరికో స్ఫూర్తినిచ్చారు.

PREV
19
సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ అంటే ఓ హిస్టరీ... బర్త్ డే సందర్భంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అరుదైన విజయాలు!
Super Star Krishna Birthday

నేడు సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna Birthday) పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి అరుదైన విషయాలు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలో గల బుర్రిపాలెం అనే కుగ్రామంలో మే 31 1943లో ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మ లకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. వీరిది వ్యవసాయ కుటుంబం. 
 

29
Super Star Krishna Birthday

సినిమాపై మక్కువతో చదువు పూర్తయ్యాక కృష్ణ (Krishna) చెన్నై వెళ్లారు. దర్శకుడు మధుసూదన రావు తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ పదండి ముందుకు(1962) చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆయన ఓ చిన్న పాత్ర చేశారు. హీరోగా కృష్ణ మొదటి చిత్రం తేనే మనసులు(1965). సోలో హీరోగా మొదటి చిత్రం కన్నె మనసులు(1966). 
 

39
Super Star Krishna Birthday


తేనె మనసులు మూవీతో కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ బిగింగ్ లోనే గూఢచారి 116 అనే ప్రయోగాత్మక చిత్రం చేశారు. హాలీవుడ్ బాండ్ చిత్రాల స్పూర్తితో ఈ మూవీ తెరకెక్కింది. 1967లో విడుదలైన సాక్షి కృష్ణకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు బాపు కావడం విశేషం. అప్పటి నుండి ఏడాదికి పది చిత్రాలకు పైగా కృష్ణ చేసేవారు. 

49
Super Star Krishna Birthday


ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కృష్ణ స్టార్ హీరోల లిస్ట్ లో చేరారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఈ క్రమంలో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ ప్రొడక్షన్స్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామ రాజు, సింహాసనం వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించారు. 
 

59
Super Star Krishna Birthday

ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్ లో కృష్ణ (HBD Krishna)350కి పైగా చిత్రాల్లో నటించారు. 1972లో ఏకంగా 17 సినిమాలు విడుదల చేసి కృష్ణ రికార్డు నెలకొల్పారు. అంత బిజీగా తీరిక లేకుండా కృష్ణ షూటింగ్స్ లో పాల్గొనేవారు.

69
Super Star Krishna Birthday

రంగు రూపు కలిగిన కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉండేది. నాలుగు తరాల హీరోయిన్స్ తో కృష్ణ జతకట్టారు. విజయ నిర్మల, జయసుధ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధ వంటి స్టార్ హీరోయిన్స్ తో ఆయన కెమిస్ట్రీ అద్భుతం. వీరితో పదుల సంఖ్యలో కృష్ణ చిత్రాలు చేశారు. వీరి కాంబినేషన్స్ లో కృష్ణ భారీ విజయాలు నమోదు చేశారు. 
 

79
Super Star Krishna Birthday

కొత్త తరం హీరోలు సత్తా చాటుతున్నా కృష్ణ మేనియా కొనసాగింది. 60లలో మొదలైన ఆయన విజయ యాత్ర 90ల వరకు కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అమ్మదొంగ, నంబర్ వన్ వంటి హిట్స్ ఆయన 90లలో సొంతం చేసుకున్నారు. 
 

89
Super Star Krishna Birthday

ప్రపంచం చిత్ర పరిశ్రమలో వచ్చిన సాంకేతిక మార్పులను కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చారు. ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ చిత్రం ఈనాడు(1982), సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు(1974), ఫస్ట్ 70 ఎం ఎం ఫిల్మ్ సింహాసనం(1986), ఫస్ట్ డీటీఎస్ ఫిల్మ్ తెలుగు వీర లేవరా(1995) కృష్ణకు చెందినవే కావడం విశేషం. 
 

99
Super Star Krishna Birthday

ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో కృష్ణ అనేక అవార్డ్స్ రివార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ సౌత్ అవార్డు(1997), ఎన్టీఆర్ నేషనల్ అవార్డు(2003),ఉత్తమ నటుడిగా నంది అవార్డు (అల్లూరి సీతారామరాజు 1974) అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆయన విశేష సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ తో గౌరవించింది. ఇక టాలీవుడ్ ఫస్ట్ కౌబాయ్ కృష్ణ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని అభిమానులు, చిత్ర ప్రముఖులు కోరుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories