హీరో కాదు కమెడీయన్ మాత్రమే..సన్నీని ఫూల్‌ని చేసిన నాగ్‌ అండ్‌ కో.. ప్రియాంక ఇజ్జత్‌ తీసిందిగా!

First Published | Nov 21, 2021, 11:24 PM IST

నాగార్జున, `అనుభవించు రాజా` టీమ్‌ కలిసి సన్నీ పరువు తీరుశారు. ఆయన హీరో కాదని, జస్ట్ కమెడీయన్‌ అంటూ షాకిచ్చారు. ఆయన చేసేది కామెడీగా ఉంటుందన్నారు. ఇంటి సభ్యులు సైతం వారి కామెంట్లకి ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss Telugu 5) పదకొండో వారం పూర్తయ్యింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో గేమ్‌ ఆడించి ఎంటర్‌టైన్‌ చేశారు. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసేలా చేశారు. నవ్వులు పూయించారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు చేసిన కామెంట్లని ప్రశ్నల రూపంలో ఓపెన్‌ చేయించి వాళ్ల అసలురూపం బయటపెట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సన్నీ పరువు తీసేశారు. ఓ రకంగా నాగార్జున అండ్‌ `అనుభవించు రాజా`(Anubhavinchu Raja) సినిమా టీమ్‌ కలిసి సన్నీని ఫూల్‌ని చేశారు. కమెడీయన్‌తో పోల్చారు. 
 

ఆదివారం ఎపిసోడ్‌లో గెస్ట్ లుగా `అనుభవించు రాజా` హీరోహీరోయిన్లు రాజ్‌తరుణ్‌(Raj Tarun) హీరోయిన్‌తోపాటు కమెడీయన్‌ సుదర్శన్‌ బిగ్‌బాస్‌5 స్టేజ్ పై సందడి చేశారు. ఇంటి సభ్యులతో వీరు ఇంటరాక్ట్ అయ్యారు. రాజ్‌ తరుణ్‌ని చూసి సిరి ఎగిరి గంతేసింది. ఇది చూసి `ఏంటీ సిరి విశాఖపట్నం కనెక్షనా?` అంటూ అక్కడి స్లాంగ్‌లో నాగార్జున(Nagarjuna) డైలాగ్‌ చెప్పడం నవ్వులు పూయించింది. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ ఉండి `సిరి సంబంధాలు చూస్తున్నాం` అని అనగా సిరి(Siri) ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గట్టిగా అరుస్తూ తలదించుకుంది. కాస్త గ్యాప్‌ ఇచ్చి `నీక్కాదు` అంటూ రాజ్‌తరుణ్‌ చెప్పడంతో మరింత నవ్వులు పూశాయి. 


`అనుభవించురాజా` టీమ్‌ సమక్షంలో ఓ గేమ్‌ ఆడిపించాడు నాగార్జున. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి వారి చేత సరదాగా గేమ్ ఆడిపించాడు. ఇందులో చిట్టీపై ఉన్న పేరుని ఓ గ్రూపు సభ్యుడు బోర్డ్ పై వేసి చూపించాలి. దాన్ని ఆయా టీమ్‌ సభ్యులు ఊహించి చెప్పాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ జరుగుతున్న సమయంలో సన్నీ ప్రస్తావన వచ్చింది. సన్నీని సన్నీనే బోర్డ్ పై గీయాల్సి వచ్చింది. ఆయన ఫైర్ లాగా గీశాడు. కానీ ఊహించలేకపోతారు ఆయన టీమ్‌. దీనికి హాస్యనటుడు సుదర్శన్‌ స్పందిస్తూ, సన్నీ ఫైర్‌ అనుకుంటాడు. కానీ మేం బయట కమెడీయన్‌ అనుకుంటాం అని చెప్పడంతో సన్నీకి దిమ్మతిరిగిపోయింది. 

దీనికి నాగార్జున మాటకలిపాడు. `కోపానికి రీజన్‌ ఉండాలి. మన దగ్గర ఉండదు` అని నాగ్‌ అనగా, `మేమేమో ఎడిటింగ్‌లో పోయిందనుకుంటున్నాం. కానీ అక్కడ కూడా ఉంటదనుకుంటే ఏం ఉండదు` అంటూ అందరి ముందరు సన్నీ పరువు తీశారు. అదే సమయంలో మంచి కమెడీయన్‌ అంటూ కామెంట్‌ చేశారు. లోబో వెళ్లిపోయాక సన్నీ బాగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు అని నాగ్‌ అనగా, సన్నీ థ్యాంక్యూ చెప్పాడు. దీనికి సుదర్శన్‌ స్పందిస్తూ ఇప్పటికీ మనోడు పొగుడుతున్నామనుకుంటున్నాడనడంతో సన్నీ మరింత షాక్‌కి గురయ్యాడు. 

మొత్తంగా సన్నీని కమెడీయన్‌తో పోల్చి హౌజ్‌లో ఫూల్‌ని చేసేశారు నాగార్జున, అండ్‌ `అనుభవించు రాజా` టీమ్‌. సన్నీ ఫైర్‌లో అర్థం లేదని, ఆయన కోప్పడుతుంటే కామెడీగా ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే సన్నీ మాత్రం స్టిల్‌ వాటిని పాజిటివ్‌గానే తీసుకోవడం విశేషం. 

మరోవైపు ప్రియాంక సింగ్‌ ఇజ్జత్‌ తీసింది. ప్రశ్నల టాస్క్ లో మానస్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో ప్రశ్నల రూపంలో రాశారు. ఎపిసోడ్‌ ప్రారంభంలోనే నాగార్జున ఆయా ప్రశ్నలను చదివి, దానిపై మీ ఒపీనియన్‌ చెప్పాలన్నారు. ప్రియాంక వంతు వచ్చినప్పుడు `నువ్వు మానస్‌ నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావని` నాగ్‌ అడగ్గా, అంతా ఆయన్నుంచి లవ్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తుందని ఊహించుకున్నారు. మానస్‌ సైతం అదే ఫీలింగ్‌లో ఉన్నాడు. 

కానీ ఆయనకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది పింకీ. గుడ్‌ ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటున్నట్టు చెప్పింది. అయితే ఆ ప్రశ్న అడిగింది మానసే కావడం విశేషం. దీనికి రాంగ్‌ సమాధానం చెప్పిందని ఇంటి సభ్యులు ఆమెకి వ్యతిరేకంగా ఓటు చేసి కాకర కాయ జ్యూస్‌ తాగిపించారు. శనివారం ఎపిసోడ్‌లో మానస్‌ని పవర్ రూమ్‌లోకి పిలిచి మరీ పింకీ విషయం ప్రశ్నించగా, తన నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుందని చెప్పాడు మానస్‌. కానీ ఈ రోజు ఎపిసోడ్‌లో మాత్రం జస్ట్ ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే ఆశిస్తున్నట్టు చెప్పడం షాక్‌కి గురి చేసింది. హౌజ్‌లో మానస్‌ ఇజ్జత్‌ తీసేసిందని చెప్పొచ్చు. 

also read: Bigg boss telugu 5: బిగ్ బాస్ లీక్... ఈ వారం హౌస్ నుండి ఆ కంటెస్టెంట్ అవుట్
 

Latest Videos

click me!