షేవ్‌ చేసుకోలేదా చిట్టి అన్న నెటిజన్‌కి `జాతిరత్నాలు` భామ బోల్డ్ రిప్లై.. వామ్మో ఇదెక్కడి తెగింపు

First Published | Nov 21, 2021, 8:08 PM IST

`జాతిరత్నాలు`తో పాపులర్‌ అయ్యింది ఫరియా అబ్దుల్లా. ఇందులో `చిట్టి`గా ఆమె పలికించిన కామెడీకి ఆడియెన్స్ కడుపుబ్బ నవ్వుకున్నారు. చిట్టిగానే తమ మదిలో ప్రింట్‌ చేసుకున్నారు. ఇప్పుడు చిట్టి ఓ నెటిజన్‌కి మైండ్‌ బ్లోయింగ్‌ రిప్లై ఇచ్చింది. 
 

Jathiratnalu Fame ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) యోగాసనాలు, మనసుని ఏకం చేసే మోటివేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను షేర్‌చేస్తూ ఎడ్యూకేట్‌ చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఫోటోని పంచుకుంది ఫరియా. ఇందులో తన తోటి ఆర్టిస్ట్ హర్ష కోమెట్‌ ఫోటోని పంచుకుంది. ఆమె ఓ ఆసనం భంగిమలోఉంది. ఈ పిక్ వైరల్‌ అవుతుంది. అయితే దీనిపై నెటిజన్లు పలు వల్గర్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఫోటోలో ఉన్నది చిట్టి అనుకుని ఆమెపై ఓ కామెంట్‌ చేశారు. ఇప్పుడు నెట్టింట దుమారంరేపుతుంది. 

ఇంతకి నెటిజన్లు పెట్టిన కామెంట్‌ ఏంటనేది చూస్తే.. ఆ పిక్ లో ఉన్న ఫరియానే అనుకుని `చిట్టి సంకలో షేవ్‌ చేసుకోలేదా` అంటూ కామెంట్‌ పెట్టాడో నెటిజన్‌. దీనికి ఫరియా స్పందించింది. మైండ్ బ్లోయింగ్‌ రిప్లై ఇచ్చింది. బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది. 


`చేసినా మళ్లీ వచ్చింది. ఎన్నిసార్లు చేయాలా? ` అంటూ బోల్డ్ గా స్పందించింది. దీంతో ఈ కన్వర్జేషన్‌ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. కొందరు ఆ నెటిజన్‌ని ఏకి పరేస్తుంటే, మరికొందరు ఫరియా బోల్డ్ నెస్‌కి షాక్‌ అవుతున్నారు. మాస్‌ ఆన్సర్‌ ఇవ్వడంపై అవాక్కవుతున్నారు. 
 

షేవ్‌ చేసుకోకుండా ఇలా ఫోటోని ఎలా దిగుతారు? ఇలంటి ఫోటోలు పోస్ట్ చేసే ముందు చూసుకోవాలి కదా అంటూ కొందరు, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చిట్టి అంటూ మరికొందరు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇంకొందరు ఆ ఫోటోలో ఉన్నది చిట్టి కాదు, హర్ష కొమెట్, తప్పుగా పోస్ట్ లు పెట్టారంటున్నారు.

మరోవైపు సదరు నెటిజన్లని ఉద్దేశించి `అరే మన చిట్టిరా అలాంటి కామెంట్లు ఏంట్రా.. అదే మీ ఇంట్లో ఆడపిల్లలపై చెయ్‌ కామెంట్లు` అంటూ మండిపడుతున్నారు. చిట్టికి మద్దతుగా నిలుస్తున్నాయి. మొత్తంగా వరుస కామెంట్లతో ఫరియా ఇన్‌స్టాగ్రామ్‌ షేక్‌ అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా ఫరియా అబ్దుల్లా రియాక్ట్ అయిన విధానం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. ఫరియాలో ఇంతటి మాస్‌ యాంగిల్‌ ఉందా అంటూ ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. ఆమె పోస్ట్ ని ట్రెండ్ చేస్తున్నారు.

ఫరియా అబ్దుల్లా.. `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో నవీన్‌ పొలిశెట్టికి జోడీగా నటించి అదరగొట్టింది. అమాయకపు అమ్మాయిగా అలరించింది. నవ్వులు పూయించింది. చివరగా లాయర్‌గా ఫరియా పండించిన కామెడీ సినిమాని పీక్‌లోకి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. 

ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటుందీ క్యూట్‌ అందాల భామ. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న `బంగార్రాజు` చిత్రంలో ఐటెమ్ సాంగ్‌ చేయబోతుందట. అలాగే మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న `ఢీ అండ్ ఢీ` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందట. మరోవైపు రవితేజతోనూ ఓ సినిమా చేస్తుందని టాక్‌. 

also read: Anchor Varshini: కొంటె చూపులతో కవ్విస్తున్న వర్షిణి.. శ్రీముఖి ఇచ్చిన షాక్‌కి కోలుకోలేకపోతుందట!
 

Latest Videos

click me!