ఒక వైపు హీరోయిన్ గా సినిమాలు, మంచి ఇమేజ్, మరో వైపు వరుసగా వ్యాపారాలు, కోట్లకు కోట్లు లాభాలతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఆస్తి విలువ ఎంత?
ఈమధ్య హీరోయిన్లు హీరోలను మించి సంపాదిస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో, హీరోల స్థాయిని అందుకోలేకపోయినా.. వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా చేతి నిండా సంపాదిస్తున్నారు. కోట్లకు కోట్లు కూడబెడుతున్నారు. గార్మెంట్, జువెలరీ, రెస్టారెంట్ బిజినెస్ లు చేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారు సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తలుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సన్ని లియోన్ కూడా ఒకరు.
26
బాలీవుడ్ లో సన్నీ లియోన్ క్రేజ్..
బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా క్రేజ్ ఉన్న సన్నీ లియోన్.. కాస్మెటిక్ బ్రాండ్, ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్స్‌లో పెట్టుబడులతో పాటు పదికి పైగా వ్యాపారాలను నడిపిస్తుంది. 2012లో వచ్చిన 'జిస్మ్ 2' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ. చాలా తక్కువ టైమ్ లోనే ఇండియాలో పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆతరువాత తిరుగులేని ఇమేజ్ తో పాటు భారీగా అభిమానులను, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సాధించింది సన్నీ లియోన్.
36
45 ఏళ్ల వయసులో 10 కి పైగా వ్యాపారాలు
ప్రస్తుతం సన్నీ లియోన్ బయసు 45 సంవత్సరాలు. నటనతో పాటు సన్నీ లియోన్ ఒక వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. రిపోర్టుల ప్రకారం, సన్నీ దాదాపు 10 వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆమె ఆస్తి విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలు, వ్యాపారాలే కాదు.. సన్నీ రకరకాల మార్గాల ద్వారా ఆదాయం పొందుతోంది.
సన్నీ లియోన్ ఒక రియాలిటీ షోకి హోస్ట్‌గా చేస్తున్నారు. సెలబ్రిటీ బాక్స్ క్రికెట్ లీగ్ టీమ్ 'చెన్నై స్వాగర్స్'కు ఆమె ఓనర్. మహిళల లైఫ్‌స్టైల్ పోర్టల్ 'Hauterfly'లో కూడా సన్నీ పెట్టుబడి పెట్టారు. ఈ రెండింటి నుంచి ఆమెకు మంచి ఆదాయం వస్తుంది. వీటితో పాటు సన్నీ లియోన్ 'లస్ట్', 'అఫెటో' అనే ఫ్రాగ్రెన్స్ బ్రాండ్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ బ్రాండ్స్ డియోడరెంట్లు, బాడీ మిస్ట్‌లు, పర్ఫ్యూమ్‌లను తయారు చేస్తాయి. 2018లో 'తీన్ పత్తీ' పేరుతో ఒక ఆన్‌లైన్ గేమ్‌ను కూడా లాంచ్ చేసింది సన్నీ.
56
నిర్మాణ సంస్థ ఓనర్
సన్నీ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి 'సన్‌సిటీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. 2015లో నిర్మాతగా మారిన సన్నీ, టాలెంట్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. అంతే కాదు చాలా కాస్మెటిక్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంది సన్నీ. దీనితో పాటు 'స్టార్ స్ట్రక్' పేరుతో సొంత కాస్మెటిక్ బ్రాండ్ నడుపుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. రీసెంట్ గా భర్త వెబర్‌తో కలిసి 'ఇన్‌ఫేమస్' పేరుతో ఇన్నర్‌వేర్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది.
66
సన్నీ లియోన్ సోషల్ మీడియా సంపాదన..
సన్నీ లియోన్ యూకేకి చెందిన 'లీసెస్టర్ గెలాక్టికోస్' అనే సాకర్ జట్టుకు సహ-యజమాని. 2019లో ఈ జట్టులో ఆమె పార్ట్నర్ గా మారింది. 2021లో సొంతంగా NFTలను లాంచ్ చేసి డిజిటల్ ఆస్తుల్లోనూ పెట్టుబడి పెట్టారు. 'ఐ డ్రీమ్ ఆఫ్ సన్నీ' అనే ఇ-ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించింది. వీటన్నింటితో పాటు, సన్నీ లియోన్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రమోషన్లు, యాడ్స్, బ్రాండ్ లాంచింగ్‌ల ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదిస్తుంది.