నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే, గతాన్ని గుర్తు చేసుకుంటూ.. సన్నీ లియోన్ హాట్ కామెంట్స్

First Published | Oct 24, 2021, 4:31 PM IST

శృంగార తార సన్నీలియోన్ గురించి కుర్రాళ్లకు పరిచయమే అవసరం లేదు. శృంగార చిత్రాలతో పాపులర్ అయిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. 

Sunny Leone

శృంగార తార సన్నీలియోన్ గురించి కుర్రాళ్లకు పరిచయమే అవసరం లేదు. శృంగార చిత్రాలతో పాపులర్ అయిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. తన పాస్ట్ ని పక్కన పెట్టేసి సినిమాల్లో బిజీ స్టార్ గా మారిపోయింది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా మొత్తం సన్నీ లియోన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 

సన్నీ లియోన్ ప్రస్తుతం రొమాంటిక్ అండ్ బోల్డ్ పాత్రలకు బ్రాండ్ గా మారిపోయింది. ఒకప్పుడు సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా రాణించిన సంగతి తెలిసిందే. పోర్న్ వదిలిపెట్టి చిత్ర పరిశ్రమలో నటిగా మారింది. ఆరంభంలో ఆమె గతం గురించి ఎన్నో ప్రశ్నలు, అవమానాలు, ట్రోలింగ్ ఎదుర్కొంది సన్నీలియోన్. కానీ ప్రస్తుతం కాల్షీట్స్ కేటాయిస్తే కోట్లల్లో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు.  


ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి హాట్ కామెంట్స్ చేసింది. సన్నీలియోన్ పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో కెనడాకు చెందిన రస్సెల్ పీటర్స్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. కొంతకాలం పాటు అతడితో సన్నీ రిలేషన్ కొనసాగించింది. 

Sunny Leone

అతడితో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. అతడితో సహజీవనం చేయడమే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకు అతడితో డేటింగ్ చేశానా అని చాలా కాలం బాధపడ్డా. కానీ మేమిద్దరం ప్రస్తుతం స్నేహితులుగా ఉన్నాం అని సన్నీ లియోన్ గతాన్ని గుర్తు చేసుకుంది. 

Sunny Leone

అతడి నుంచి విడిపోయాక సన్నీలియోన్ 2011లో డేనియల్ వెబర్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సన్నీలియోన్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. 

Sunny Leone

తెలుగులో సన్నీ.. గరుడ వేగ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సన్నీలియోన్ ప్రధాన పాత్రలో దర్శకులు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు. 

Latest Videos

click me!