పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ.. తనకంటే ముందే తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ పెళ్లి అంటూ షాకింగ్‌ ట్విస్ట్

First Published | Oct 24, 2021, 2:35 PM IST

రౌడీ బాయ్‌, `లైగర్‌` స్టార్‌ విజయ్‌ దేవరకొండ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయన్ని అభిమానించే అమ్మాయికు పెద్ద షాకిచ్చాడు. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. తనకంటే ముందే తమ్ముడు పెళ్లి జరుగుతుందంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. 

`పెళ్లి చూపులు` చిత్రంతో పాపులర్‌ అయిన విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) `అర్జున్‌రెడ్డి`తో ఊహించిన ఇమేజ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. `గీతగోవిందం`తో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు `లైగర్‌` చిత్రంతో పాన్‌ ఇండియాపై కన్నేశాడు. తిరుగులేని ఇమేజ్‌, అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న Vijay Devarakonda ఇప్పుడు అమ్మాయిలకు షాకిచ్చాడు. పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. 
 

ఇంటికి పెద్దవాడైన విజయ్‌.. తన పెళ్లి ఇప్పట్లో ఉండదని చెప్పేశాడు. అంతేకాదు ముందు తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ(Anand Devarakonda) మ్యారేజ్‌ జరుగుతుందని తేల్చి చెప్పేశాడు. `దొరసాని` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్‌ దేవరకొండ ఇటీవల `మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌` చిత్రంతో మరో హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు `పుష్పకవిమానం` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాని విజయ్‌ దేవరకొండ నిర్మిస్తుండటం విశేషం. 
 


సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండ, Anand Devarakonda ఓ సూపర్‌ క్యాండీడ్‌ ఇంటర్వ్యూ చేశారు. ఇద్దరిని యాంకర్ ఇంటర్వ్యూ చేయగా వీరిద్దరు ఆసక్తికర, ఫన్నీ ఆన్సర్లతో రెచ్చిపోయారు. యాంకర్‌నే తికమక పెట్టారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇందులో విజయ్‌ చెప్పిన విషయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 
 

పెళ్లి కూడా వీడిదే ఫస్ట్ అవుతుందని తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ వైపు వేలు చూపించాడు విజయ్‌ దేవరకొండ. దీనికి తమ్ముడు ఆనంద్‌ స్పందిస్తూ లేదు లేదు.. అంటూ సిగ్నల్స్ ఇస్తూ, తల ఊపుతూ కనిపించడం నవ్వులు పూయిస్తుంది. ఆనంద్‌ స్పందిస్తూ ఇట్లాంటి రిస్క్ లన్నీ నా మీద పెడతాడన్నట్టు అంటూ విజయ్‌ వైపు చూపించారు. దానికి విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ.

ఆ తర్వాత తమ్ముడు ఆనంద్‌పై కంప్లైంట్‌ ఇచ్చాడు విజయ్‌.. ఇంటికొచ్చి రెండు నెలలు హాలీడేస్‌ అనగానే చుక్కలు చూపించేవాడని గతంలో ఆనంద్‌ చేసిన అల్లరి విషయాలను బయటపెట్టాడు రౌడీ బాయ్‌.

ఆ తర్వాత ఇద్దరి అమ్మ ఫేవరేట్ ఎవరూ అంటూ ఇద్దరూ చేతులెత్తడం విశేషం. వాళ్లమ్మకి ఇద్దరూ ఇష్టమే అనే విషయాన్ని వెల్లడించారు. అమ్మకి పిల్లలెవరైనా ఇష్టమే అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ ఆకట్టుకుంటుంది. పూర్తి ఇంటర్వ్యూ రేపు(సోమవారం) విడుదలకానుంది.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియాచిత్రంగా రూపొందుతుంది. ఇందులో అనన్య పాండే కథానాయిక. బాక్సింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది. మరోవైపు ఆనంద్‌ దేవరకొండ నటించిన `పుష్పక విమానం` రిలీజ్‌కి రెడీ అవుతుంది. దీంతోపాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు ఆనంద్‌. 

also read: బిగువైన ఎద అందాలతో చీకటి గదిలో యాంకర్‌ విష్ణుప్రియా విరహ వేదన.. మరోవైపు జాకెట్‌ బటన్స్ విప్పేసి అసలైన విందు

Latest Videos

click me!