`జాట్‌` హీరో సన్నీ డియోల్‌ విలన్‌గా నటించిన 7 సినిమాలు.. ఆడియెన్స్ నుంచి రిజెక్షన్‌

Published : May 14, 2025, 02:42 PM IST

సన్నీ డియోల్‌ మనం ఎక్కువగా యాక్షన్ హీరోగానే చూసినా, ఆయన చాలా సినిమాల్లో విలన్, గ్రే షేడ్స్ ఉన్న పాత్రలు కూడా పోషించారు. ఆయన నటించిన సినిమాల్లో ఏవి హిట్ అయ్యాయి, ఏవి ఫ్లాప్ అయ్యాయనేది చూద్దాం. 

PREV
17
`జాట్‌` హీరో సన్నీ డియోల్‌ విలన్‌గా నటించిన 7 సినిమాలు.. ఆడియెన్స్ నుంచి రిజెక్షన్‌
నరసింహ

1991లో విడుదలైన `నరసింహ` సినిమాలో సన్నీ  డియోల్‌ యాంటీ-హీరోగా నటించారు. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. ఆడియెన్స్ ని అలరించలేకపోయింది. 

27
ఘాతక్

1996లో విడుదలైన `ఘాతక్` సినిమాలో సన్నీ డియోల్‌ విలన్‌గా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌.

37
అర్జున్ పండిట్

1999లో వచ్చిన `అర్జున్ పండిట్` సినిమాలో సన్నీ డియోల్ ది గ్రే షేడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. 

47
జానీ దుష్మన్

2002లో వచ్చిన `జానీ దుష్మన్` సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సన్నీ  డియోల్‌ నెగటివ్ షేడ్‌ ఉన్న రోల్‌లో కనిపించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. 

57
ఫాక్స్

2009లో వచ్చిన `ఫాక్స్` సినిమాలో సన్నీ డియోల్‌ పూర్తిగా నెగటివ్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమా సైతం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. 

67
రైట్ యా రాంగ్

2010లో విడుదలైన `రైట్ యా రాంగ్` సినిమాలో సన్నీ డియోల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. ఆయనది నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర. ఈ సినిమా కూడా ఫ్లాప్.

77
డిష్కియావూ

2014లో విడుదలైన `డిష్కియావూ` సినిమాలో సన్నీ డియోల్‌ నెగటివ్‌ షేడ్‌ ఉన్న గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఈ సినిమా థియేటర్లలో పరాజయం చెందింది. ఇలా సన్నీ డియోల్‌ నెగటివ్‌ రోల్స్ చేసిన వాటిలో ఒకటి అర తప్పితే అన్ని సినిమాలు పరాజయం చెందాయి. ఆయన్ని హీరోగానూ ఆడియెన్స్ చూడాలనుకోవడం విశేషం.  

ఇటీవల సన్నీ డియోల్‌ `జాట్‌` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని రూపొందించిన ఈ చిత్రంలో యావరేజ్‌గా ఆడింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories