"విశ్వంభర": ఈ రెండు తేదీలలో ఒక రోజు రిలీజ్ డేట్ ఫైనల్ !
చిరంజీవి 'విశ్వంభర' సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా రెండు విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు - జూలై 24 లేదా ఆగస్టు 21.
చిరంజీవి 'విశ్వంభర' సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా రెండు విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు - జూలై 24 లేదా ఆగస్టు 21.
మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ చిత్రం "విశ్వంభర"(Vishwambhara) . చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి .
ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదే ఈ చిత్రం రిలీజ్ డేట్.నిర్మాతలు ఈ చిత్రం కోసం రెండు సాధ్యం విడుదల తేదీలను పరిశీలుస్తున్నట్లు సమాచారం.
"విశ్వంభర" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌లో జాప్యం కారణంగా విడుదల నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. మొదట సంక్రాంతికి కానుకగా ఈ సినిమాని 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటన చేసారు.
ఆ తరువాత ఈ చిత్రం మే 9కి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా కాదని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ షెడ్యూల్ ప్రకారం జూలై 24న “విశ్వంభర” థియేటర్లలోకి రావచ్చు. కాకపోతే, చిరంజీవి పుట్టినరోజుతో పాటుగా ఆగస్ట్ 21కి విడుదల తేదీ మారవచ్చు అని తెలుస్తోంది.
మరో ప్రక్క చిరు మేనల్లుడు, నటుడు సాయిదుర్గా తేజ్ (sai durgha tej) ఈ సినిమాలో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయన అతిథి పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్‌స్క్రీన్‌లో హీరో (చిరంజీవి) మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం.
సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీనికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తుండగా.. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.