దారుణం: రిలీజ్ కు ముందే 'సికందర్' మొత్తం లీక్,షాక్ లో సల్మాన్
సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమా విడుదల కాకముందే పైరసీకి గురైంది. రంజాన్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది, కానీ పైరసీ కారణంగా సల్మాన్ కు ఇది పెద్ద దెబ్బే.
సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమా విడుదల కాకముందే పైరసీకి గురైంది. రంజాన్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది, కానీ పైరసీ కారణంగా సల్మాన్ కు ఇది పెద్ద దెబ్బే.
పైరసీ అనేది చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ భయపెడుతోంది. పైరసీ ఏ స్దాయికి వెళ్లిందంటే సినిమా మార్నింగ్ షో పూర్తయ్యే సరికే పైరసీ సైట్స్ లో అప్ లోడ్ అయ్యిపోతోంది.
ఇప్పుడు సల్మాన్ తాజా చిత్రం సికిందర్ మరీ దారుణంగా రిలీజ్ కు ముందే పైరసీ సైట్స్ లో ప్రత్యక్షమై షాకిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సికందర్.
ఈ మూవీకి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
ఈ సినిమా ఈ రోజు నుంచి రంజాన్ కానుకగా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే నిన్నటి నుంచే ఈ సినిమా పైరసీ సైట్ల్ లో హల్ చల్ చేస్తోంది. హెచ్ డీ ప్రింట్ ఉండటం షాక్ ఇస్తోంది.
అసలే గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు హిట్ అనేది లేదు. ఈ పరిస్దితుల్లో ఇలా కొత్త సినిమా పైరసీ సైట్స్ లోకి రావటం ఏం చేయాలో తెలియని పరిస్దితి క్రియేట్ చేస్తోంది.
అప్పటికీ టీమ్ పైరసీ లింక్ లు తీయిస్తున్నారు. అయినా చాలా చోట్ల స్ప్రెడ్ అయ్యిపోయింది. ఇది సల్మాన్ కు పెద్ద దెబ్బే.
రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైన సికిందర్ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్‌వాలా నిర్మించారు.
రజనీకాంత్ దర్బార్ (2020) సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో సికిందర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. కాగా.. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందించారు.