రీసెంట్ గా నయనికాతో నిశ్చితార్థం చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. పెళ్లి డేట్ పై తాజాగా ఓ ప్రకటన కూడా చేశాడు. కానీ అందులో ఎంత పెద్ద ట్విస్ట్ ఉందో తెలుసా? అల్లు అర్జున్ అభిమానులకు సర్‌ప్రైజ్ కూడా ఉంది.
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఓ సర్‌ప్రైజ్ న్యూస్ ను వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి తేదీకి సంబంధించిన శుభవార్తను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. రీసెంట్ గా అక్టోబర్ 31న నయనికతో నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్... 2026 మార్చి6 న తాము వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అంతే కాదు ఈ డేట్ అనౌన్స్ మెంట్ తో అల్లు అర్జున్ అభిమానులకు సర్‌ప్రైజ్ కూడా ఇచ్చాడు శిరీష్.
25
అన్నపెళ్లి రోజే.. తమ్ముడి పెళ్లి కూడా..
అల్లు శిరీష్ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేస్తూ తన పెళ్లి శుభవార్తను ప్రకటించారు. ఆ వీడియోలో పెళ్లి తేదీతో పాటు కుటుంబానికి సంబంధించిన ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ప్రస్తావించారు. అల్లు శిరీష్ తన అన్న.. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ పెళ్లి రోజునే.. తాను కూడా వివాహం చేసుకోబోతున్నాడు. 2011 మార్చి 6వ తేదీన అల్లు అర్జున్ తాను ప్రేమించిన స్నేహారెడ్డిని పెళ్లాడగా.. 2026 మార్చి 6న అల్లు శిరీష్.. తాను ప్రేమించిన నయనికాను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి అల్లు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
35
అల్లు శిరీష్ - నయనిక ప్రేమ ఎప్పుడు మొదలయ్యింది..
అల్లు శిరీష్, నయనిక 2023లో ప్రేమలో పడ్డారు. వారి మధ్య స్నేహం మొదలై.. అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు వచ్చారు. అల్లు శిరీష్ తమ ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, “నా జీవితంలోని ప్రేమతో నేను ఆనందంగా నిశ్చితార్థం చేసుకున్నాను” అని క్యాప్షన్ రాశారు. ఆ పోస్టుకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇక అల్లు శిరీష్ ను పెళ్లాడనున్న నైనికా ఎవరు? ఆమె ఏం చేస్తుంది? ఎంత సంపాదిస్తుంది అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. మెగా, అల్లు అభిమానులు ఈ విషయం తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, నయనికా హైదరాబాదులో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వాటితో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా నయనిక ఫ్యామిలీ రాణిస్తున్నట్టు సమాచారం. ఇక నైనిక కూడా బెంగళూర్ లో రెండు ఐటీ కంపెనీలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆదాయం నెలకు కోట్లలో ఉంటుందని సమాచారం.
55
అల్లు శిరీష్ ఫిల్మ్ కెరీర్..
అల్లు శిరీష్ ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఆయన కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా కొనసాగలేదు. అల్లు శిరీష్ గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు..వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు పొందారు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. శిరీష్ సినిమా చేసి చాలా కాలం అవుతోంది. మరి ఆయన ఇదే రంగంలో కొనసాగుతాడా..? లేక వ్యాపారంలోకి దిగుతాడా అనేది చూడాలి.