
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ బాధపడుతూ ఉండగా గోవిందరాజులు మన చేతుల్లో ఏముంది జ్ఞానం ఎన్నో అనుకుంటాం కానీ ఆ దేవుడు ఎలా రాత రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని బాధపడతాడు గోవిందరాజులు. అప్పుడు విష్ణు బాధపడుతూ ఉండగా రామచంద్ర విష్ణు ని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణు చాలా ఆశలు పెట్టుకున్నాను అన్నయ్య పాప పుడితే అమ్మ పేరు పెట్టుకోవాలి అనుకున్నాను. నా ఎదురుచూపే నా బిడ్డకు దిష్టి తగిలిందేమో అందుకే ఇలా జరిగింది అని బాధపడతాడు విష్ణు. అప్పుడు జ్ఞానాంబ మనమే ఇంత బాధపడుతుంటే కాబోయే తల్లి మల్లిక ఇంకెంత బాధపడుతుందో అని బాధపడుతూ ఉండగా ఆ మాటలు విన్న జానకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇప్పుడు దీనంతటికీ కారణం ఆ మల్లికనే అని మల్లిక దగ్గరికి వెళ్తుంది జానకి. మరొకవైపు మల్లిక తన గదిలో డాన్సులు వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఎవరో రావడం గమనించిన మల్లిక ఫోటోలు చూస్తూ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అప్పుడు జానకి అక్కడికి రావడంతో నువ్వా జానకి అంటూ స్టైల్ గా ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడుతుంది మల్లిక. అప్పుడు జానకి నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేశావు అందర్నీ ఇలా బాధ పెడుతున్నావు అని అనగా ఏం చేయాలి జానకి అసలు నిజం తెలిస్తే అత్తయ్య గారు కోప్పడతారు అందుకే నేను ఇలా చేశాను అంతా మంచే చేశాను జానకి అనడంతో వెంటనే జానకి కోప్పడుతుంది. అప్పుడు జానకి ఇంతకుముందే చెప్పేయాలి అనుకున్నాను నీ కాపురం గురించి ఆలోచించి చెప్పలేదు అని అనగా వెంటనే మల్లిక కొంపదీసి ఇప్పుడు చెప్పేస్తావా జానకి చెప్పొద్దు జానకి అంటూ బ్రతిమిలాడినట్లు యాక్ట్ చేస్తుంది.
అప్పుడు జానకి నువ్వు ఎలాగో చెప్పలేవు కదా అంటూ నవ్వుకుంటూ మాట్లాడుతుంది మల్లిక. అప్పుడు జానకి ఇక మల్లిక మారదు అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రామచంద్ర విష్ణు మాటలు తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. మల్లిక కడుపు పోయినందుకు అమ్మ వాళ్ళు బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను జానకి గారు అని అంటాడు రామచంద్ర. మీరు కూడా చాలా బాధపడి ఉంటారు అని అనగా నాకు బాధ లేదు రామా గారు అనడంతో రామా ఆశ్చర్యపోతాడు. అదేంటి జానకి గారు అనడంతో అసలు మల్లిక ప్రెగ్నెంట్ అయితేనే కదా ఆ కడుపు పోయిందని బాధపడడానికి అని అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు.
అప్పుడు జరిగింది మొత్తం చెప్పడంతో రామచంద్ర షాక్ అవుతాడు. అమ్మని విష్ణువుని ఇంత మోసం చేసిన మళ్ళిక ని ఈరోజు వదిలిపెట్టను అని రామచంద్ర కోపంతో అక్కడికి వెళుతుండగా జానకి ఆపుతుంది. ఇంత నాటకం ఆడి అమ్మని తమ్మున్ని ఇంత బాధ పెట్టిందని తెలిసి కూడా ఎలా ఊరికే ఉండమంటారు జానకి గారు అని అంటాడు రామచంద్ర. అప్పుడు జానకి తప్పదు రామచంద్ర గారు తప్పదు అని అంటుంది. కొన్ని ఆవేశాలు బంధాలతో ముడిపడి ఉంటాయి ఆవేశం కట్టలు తెంచుకొని బంధాలు కూడా తెగిపోతాయి అని అంటుంది జానకి. ఇటువంటి విషయాలలో అత్తయ్య గారి కోపం విష్ణు కోపం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా అని రామచంద్ర కు నచ్చచెబుతుంది జానకి.
నేను తనకి ఎంత మంచి చెప్పడానికి ప్రయత్నించాను కానీ తన తెలివి తక్కువ తనంతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తూనే వచ్చింది ఈ విషయం ఇంతటితో వదిలేయండి రామచంద్ర గారు అని అంటుంది జానకి. అప్పుడు రామచంద్ర మాధురి విషయంలో మీ వివరాలు ఎంతవరకు వచ్చాయి ఆ హత్య చేసింది ఎవరో తెలిసిందా అని అడగగా తెలిసింది అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు. ఎవరండీ వాడు అనడంతో త్వరలోనే చెబుతాను అని అంటుంది జానకి. మరొకవైపు సునంద కాంట్రాక్టుల విషయం మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. అప్పుడు నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని సునంద అడగగా జానకి ఇచ్చింది అని చెబుతాడు పోలీస్.
జానకి కేసు పెడితే నువ్వు ఎగేసుకొని రావడం ఏంటి మైండ్ ఉందా అని నాతో ఎవిడెన్స్ కూడా దొరికాయి మేడం అని అనగా ఏంటి ఆ ఎవిడెన్స్ అనడంతో ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించిన స్పాట్ లో కన్నబాబు గోల్డ్ రింగు కూడా దొరికింది అని ఆ గోల్డ్ రింగు సునందకి చూపిస్తాడు పోలీస్. వీటితో పాటు ఇంకా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మేడం అని అనడంతో ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోనికి చాలా అవకాశాలు ఉంటాయి ఇన్స్పెక్టర్ గారు అని అనగా అవేంటో మీరే చెప్పండి మేడం అని అంటాడు పోలీస్. అప్పుడు సునంద రివర్స్ నాటకం ఆడుతూ డ్రైవర్ ని అక్కడికి పిలిచి నా కొడుకు ఫోను రింగు పోయినట్లు నాలుగు రోజులకు కంప్లైంట్ ఇచ్చినట్టు రాసుకోండి ఇతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లండి అని అంటుంది.
అప్పుడు డ్రైవర్ ని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో ఇంతలో అక్కడికి కన్నబాబు వస్తాడు. ఏమైందమ్మా ఎందుకు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు అనడంతో కన్నబాబు చెంప చెల్లుమనిపిస్తుంది సునంద. ఏం జరిగింది అనడంతో అప్పుడు సునంద అసలు విషయం చెప్పగా కన్నబాబు షాక్ అవుతాడు. నిన్ను ఎలా అయినా వదిలిపెట్టను జానకి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు కన్నబాబు. మరొకవైపు జానకి జ్ఞానాంబ కి అసలు విషయం చెప్పడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. మాధురి మీద హత్య ప్రయత్నం చేసింది కన్న బాబా అనడంతో అవును అత్తయ్య గారు అని అంటుంది జానకి. అందుకే అత్తయ్య గారు మాధురి పేరెంట్స్ తో కన్నబాబు మీద కేసు పెట్టించి అరెస్టు చేయించాను అని అంటుంది జానకి. దాంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు జానకి చేసిన పనికి జ్ఞానాంబ మెచ్చుకుంటూ ఉండగా రామచంద్ర సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు జెస్సి జానకికి థాంక్స్ అని చెబుతుంది.