మహేష్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మెంబెర్స్ ని కలుసుకున్నారు. వారితో కలిసి టీమ్ ప్రమోషనల్ షూటింగ్ ఏదో చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ సమయంలోనే సూపర్ స్టార్ తో ఫోటో దిగిన కమ్మిన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ తో అంటూ రాసుకొచ్చారు. వారి ఫోటోను రీ ట్వీట్ చేస్తూ.. మహేష్ కూడా రిప్లై ఇచ్చారు.