ఆలియా, కత్రినా తో పాటు ఇండియాలో ఓటు హక్కు లేని హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Published : Apr 22, 2024, 08:24 PM ISTUpdated : Apr 22, 2024, 08:31 PM IST

ఓటు అనేది మన గుర్తింపు.. సామాన్యులైనా... సెలబ్రిటీలు అయినా..ఒటు హక్కును వినియోయించుకుని బాధ్యతగా ఉండాలి. అయితే కొంత మందికి ఓటు వేయడం సాధ్యం కాకపోవచ్చు. పరిస్థితుల ప్రభావం అలా వస్తుంటుంది. అలా ఓటుహక్కును ఇప్పటి వరకూ వినియోగించుకోని హీరోయిన్లు ఎవరో తెలుసా..

PREV
15
 ఆలియా, కత్రినా తో పాటు ఇండియాలో ఓటు హక్కు లేని హీరోయిన్లు ఎవరో తెలుసా..?

సామాన్యుల సంగతి అలా ఉంచితే.. ఇండియాలో ఇప్పటి వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేని కొందరు బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు అని మీకు తెలుసా..? వింటానికి విచిత్రంగా ఉన్నా... వారి ఒక్క సారి కూడా ఓటు హక్కును వాడలేదట. కత్రీనా కైఫ్ తో సహా.. ఓటు వేయని పలువరు బాలీవుడ్ హీరోయిన్ల లిస్ట్ చూద్దాం. 

25

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. ఆలియా భట్. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఆమె పేరు కూడా ముందుంటుంది. అటువంటి  అలియా భట్ ఇంతవరకూ ఇండియాలో ఓటు వేయలేదట. దానికి కారణం ఏంటో తెలుసా..? షాకింగ్ న్యూస్ ఏంటంటే.. నిజానికి అలియా భట్ భారత పౌరురాలు కాదు. అలియాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఎందుకంటే ఆమె తల్లి బర్మింగ్‌హామ్‌కి చెందిన మహిళ కావడంతో..  అలియా భట్ కూడా  అక్కడే పుట్టింది. దీంతో ఆలియా భారత్‌లో ఓటు హక్కులేదు. 

35

అంతే కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్... కోట్ల మంది అభిమానులను పొందిన  కత్రినా కైఫ్  కూడా  భారత ఫౌరురాలు కాదు., అందుకే ఆమెకి ఇక్కడ ఓటు హక్కులేదు. బాలీవుడ్ లో  ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను సాధించిన కత్రీనా.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇక కత్రీనా కైఫ్ పుట్టింది హాంకాంగ్‌లో. అంతే కాదు ఆమె  బ్రిటిష్ పౌరసత్వం కూడా కలిగి ఉంది. కాని ఇండియాలో మాత్రం ఆమెకు పౌరసత్వం లేదు.

45

మరో వైపు బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఇండియాలో ఓటు వేయడానికి అర్హత లేదు. ఆమె కూడా  భారతీయురాలు కాదు.  బాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఇండియాలో పుట్టలేదు. జాక్వెలిన్ బహ్రెయిన్ కు చెందిన లేడీ. ఆమె అక్కడే పుట్టింది. అంతే కాదు జాక్వెలిన్ తల్లీ తండ్రులు కూడా ఇండియన్స్ కాదు. జాక్వెలిన్ తండ్రిది శ్రీలంక కాగా..  ఆమె తల్లి మలేషియా పౌరురాలు. ఇక ఈ హీరోయిన్ ఆస్ట్రేలియాలో కాలేజీ పూర్తి చేసి.. శ్రీలంకలో సెటిల్ అయ్యింది. తరువాత జాక్వలిన్ బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యింది. 

55

ఇక నోరా ఫతేహి గురించి అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో స్సెషల్ సాంగ్స్ తో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇండియాన్ కాదు. ఆమె భారత దేశంలో ఓటు వేయడానికి అర్హత లేదు. నోరా కెనడా పౌరురాలు. ఆమె అక్కడే పుట్టింది. ఇండియాలో సెటిల్ అయ్యింది. ఇప్పటికీ తన మూలాలు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా మరికొన్ని ఇండస్ట్రీలలో.. మరికొంత మంది తారలు కూడా ఇతర దేశాల పౌరసత్వం కలిగి ఉన్నారు. అందేకే వారు ఇండియాలో ఓటు వేయలేరు. 

Read more Photos on
click me!

Recommended Stories