
బిగ్ బాస్ తెలుగు 9వ 11 వారం సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ హీటెక్కించింది. ఇక మంగళవారం(72వ రోజు) హౌజ్‌లో ఫ్యామిలీ వీక్ నడిచింది. సుమన్ శెట్టి, తనూజ ఫ్యామిలీస్ వచ్చారు. అయితే వీరికి కొంత టైమ్ లిమిట్ పెట్టారు. సుమన్ కి 20 నిమిషాల టైమ్ లిమిట్స్ ఇస్తే, తనూజకి గంట టైమ్ ఇవ్వడం విశేషం. అంతకంటే ముందే ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తాడుని తన బాడికి చుట్టుకుని ముందుగా టార్గెట్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సుమన్ శెట్టి వెనకబడిపోయాడు. సుమన్ కోసం కళ్యాణ్ త్యాగం చేయడం విశేషం.
అనంతరం సుమన్ శెట్టి ఫ్యామిలీ వచ్చింది. ఈ రోజు ఆయన మ్యారేజ్ యానివర్సరీ. దీంతో ముందుగా ఆయన భార్య లాస్య హౌజ్‌లోకి వచ్చింది. భార్యని చూసి ఉబ్బితబ్బిబయ్యాడు సుమన్. ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. భార్యని గట్టిగా హగ్ చేసుకుని ముద్దులు పెట్టారు. వీరి జంటని చూసి హౌజ్ మేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్న తీరు కూడా ఎంతో ముచ్చటేసింది. వీరి మధ్య ప్రేమకిది నిదర్శనంగా నిలిచిందని చెప్పొచ్చు. భార్య రాగానే తన కొడుకు గౌతమ్ ఎలా ఉన్నాడు, అమ్మా, నాన్న ఎలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నారంటూ అడిగి తెలుసుకున్నారు సుమన్.
ఆ తర్వాత సుమన్ గేమ్‌ల గురించి అడిగాడు. దీంతో లాస్య కూడా చాలా పాజిటివ్‌గా చెప్పింది. జెన్యూన్‌గా ఉంటున్నావ్, ఇంట్లో ఎలా ఉంటున్నావో, ఇక్కడ కూడా అలానే ఉంటున్నావ్, నీపై చాలా పాజిటివ్ టాక్ ఉందని తెలిపింది లాస్య. ఎవరిని బాధపెట్టడం లేదని, చాలా బాగా ఆడుతున్నావని తెలిపింది లాస్య. ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయాన్ని పంచుకుంది. తనూజకి దూరంగా ఉండాలని, ఆమెతో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తనూజతో ఉంటే ఆమెకే హైప్ వెళ్తుందని, ఎవరైతే హైప్‌లో ఉంటారో, వారిని మంచిగా చేసుకోవాలనుకుంటుందని, ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపింది లాస్య. ఆమె చెప్పిన విషయం ఆశ్చర్యపరుస్తోంది. భార్య రాకతో సుమన్ వెట్టి ఫుల్ హ్యాపీ అయ్యాడు. భార్య ఆయన కోసం స్పెషల్ ఫుడ్ తీసుకురావడం విశేషం.
అనంతరం తనూజ నుంచి ఫ్యామిలీ వచ్చింది. ఆమె అక్క అను కూతురు శ్రేష్ట,చెల్లి పూజా వచ్చింది. శ్రేష్టని చూసి తనూజ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ పాపతో కాసేపు ఆడుకోగానే చెల్లి పూజా వచ్చింది. త్వరలోనే ఆమె పెళ్లి, తనూజ వెళ్లలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆమెని హౌజ్‌లోకి పంపించారు. గేమ్ బాగా ఆడుతున్నావని, నీకు ఇంటా బయట అంతా పాజిటివ్‌గా ఉందని, అందరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. కానీ ప్రతి దానికి ఏడవద్దు అని, అరవొద్దు అని తెలిపింది. నువ్వు ఏడుస్తుంటే అమ్మ ఏడస్తుందని, చాలా బాధపడుతుందని చెప్పింది. ఆమెని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని, ఓ వైపు పెళ్లి పనులు, మరోవైపు అమ్మ, ఇలా అన్నింటిని మ్యానేజ్ చేయడం కష్టంగా ఉందని, కానీ నువ్వు ఏడవకుండా బాగా ఆడాలని తెలిపింది పూజా. అనంతరం పూజాకి బొట్టుపెట్టి, గాజులు, బట్టలు పెట్టి హౌజ్‌లోనే పెళ్లి కూతురుని చేసింది తనూజ. ఈ మూమెంట్ ఆకట్టుకుంది.
నామినేషన్‌లో రీతూ చౌదరీ, డీమాన్ పవన్ ల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దీన్ని ఇమ్మాన్యుయెల్ ఆటపట్టించాడు. పాపం పిల్లోడిని, అమాయకుడిని ఆగం చేశావంటూ సెటైర్లు వేస్తూ నవ్వులు పూయించారు. అయితే ఇందులో రీతూ గురించి దివ్య హాట్ కామెంట్ చేసింది. ఆమెని తాను తొక్కుతున్నానని అంటుందని, తాను సేఫ్‌గా ఉండేందుకు తనని నామినేట్ చేస్తుందని దివ్య చెప్పింది. అదే సమయంలో తనూజ కూడా సొంతంగా గేమ్ ఆడొద్దని, నీ కోసం గేమ్ ఆడాలని చెప్పింది. అందుకే తనని నామినేషన్ నుంచి సేవ్ చేసినట్టు వెల్లడించింది తానూజ. అంతేకాదు రీతూ డీమాన్ కోసమే గేమ్ ఆడుతుందని కామెంట్ చేయడం గమనార్హం. ఇలా ఫ్యామిలీ వీక్‌తో, మరోవైపు ఒకరిపై ఒకరు డిస్కషన్స్ తో మంగళవారం ఎపిసోడ్ నడిచింది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో డీమాన్ అమ్మ వచ్చింది.