కమెడియన్ సుమన్ శెట్టి 13వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. అంతకు ముందు నాగార్జున తో చాలా విషయాలు మాట్లాడాడు సుమన్. తాను దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించానని.. తెలుగు, తమిళం, భోజ్ పురి సహా అనేక భాషల్లో నటించానని సుమన్ శెట్టి అన్నారు. అంతే కాదు 'జయం' సినిమాతో డైరెక్టర్ తేజ తనకు ఛాన్స్ ఇచ్చారని.. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ తనకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిందని, తన ఆట ఏంటో చూపిస్తానని అన్నారు. ఈక్రమంలో సుమన్ శెట్టి కామెడీని నాగార్జున గుర్తు చేశారు. అంతే కాదు సమన్ శెట్టి బాగా ఫేమస్ అయిన '7/G బృందావన కాలనీ' సినిమాలోని డైలాగ్స్ చెప్పమని అడిగి మరీ చెప్పించుకుని నాగార్జున ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జునతో కలిసి నటించిన 'శివమణి' సినిమా షూటింగ్ విశేషాలను కూడా వారు గుర్తు చేసుకున్నారు.