లిమ్కా రికార్డ్స్ టు క్రాంటవర్సీ.. ప్రభాస్ హీరోయిన్ సంజన గల్రానీ బ్యాక్‌ గ్రౌండ్‌ తెలుసా?

Published : Sep 07, 2025, 10:30 PM IST

Bigg Boss Telugu 9 Sanjana Galrani: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 10వ కంటెస్టెంట్‌గా బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.సంజన గల్రానీ బ్యాక్‌ గ్రౌండ్‌ తెలుసా?

PREV
16
బుచ్చిగాడు ఫేమ్ సంజన ఎంట్రీ

Bigg Boss Telugu 9: ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “డబుల్ హౌస్ – డబుల్ డోస్” థీమ్‌తో సీరీస్ కొత్త హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రత్యేకంగా సామాన్యులు కూడా హౌస్‌లోకి తీసుకరావడం ఈ సీజన్‌లో కొత్త హైలైట్‌గా మారింది. ఒక్కొక్కరుగా సెలబ్రెటీలు హౌస్‌లో అడుగు పెట్టే సంధర్భంలో, కన్నడ స్టార్ హీరోయిన్ సంజన గల్రానీ 10వ కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. 

26
స్టేజ్ పై సంజన కన్నీళ్లు

కింగ్ నాగార్జున సంజన ను పరిచయం చేస్తూ స్పెషల్ ఏవీ చూపించారు. ఆ వీడియోలో హాయ్ ఇది మీ అర్చన అంటూ కన్ఫూజ్ చేసింది. ఆ తరువాత మీ బుచ్చిగాడు సంజన అంటూ కూల్ గా పరిచయం చేసుకుంది. కెరీర్‌లోని ఓ కష్ట సమయాన్ని వివరించింది. తనను కావాలని కొందరూ ఒక కేసులో ఇరికించారని, విచారణ కోసం అరెస్ట్ అయ్యానని, అయితే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా సంజన వెల్లడించారు. 

36
వాళ్లు జీవితాన్ని సర్వనాశనం చేశారు

ఆ తరువాత కింగ్ నాగార్జున తో కన్నడ స్టార్ హీరోయిన్ సంజన గల్రానీ మాట్లాడుతూ కెరీర్‌లో కష్టాలు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తన కెరీర్‌ పీక్స్ ఉన్నా సమయంలో తనను కావాలని ఓ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ కోసం పిలిచి అరెస్ట్ అయ్యానని పేర్కొన్నారు. అయితే, ఆ కేసులో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా సంజన వెల్లడించారు. తనని తాను నిరూపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చానని ఆమె స్పష్టంగా చెప్పారు.

46
అది ప్రూ చేయడానికే బిగ్‌బాస్‌లోకి

కరోనా లాక్‌డౌన్ సమయంలో డాక్టర్ అజీజ్ పాషాతో తన పెళ్లి జరిగిందనీ, తనకు ఇద్దరూ పిల్లలను చెప్పింది. గతంలో కాస్టింగ్ కౌచ్, వేధింపుల విషయాలపై సంజన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సంజన పొద ముండం సినిమాతో పాటు బుల్లితెరపై యాక్టివ్‌గా ఉంటూ, బిగ్‌బాస్ తెలుగు 9లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకు సిద్ధమయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాల మధ్య ఆమె అభిమానుల మన్నన సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. సంజన తెలిపినట్లుగా, గెలుస్తానో లేదో తెలియదు, కానీ ప్రతి ప్రేక్షకుల హృదయంలో తన స్థానం ఉండాలని ఆమె ఆశపడుతోంది.

56
సంజన బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే..

సంజన బెంగళూరులో జన్మించారు. ఆమె చెల్లెలు నిక్కీ గల్రానీ కూడా నటి. చిన్నతనం నుండే మోడలింగ్‌లో అడుగు పెట్టింది సంజన, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహమ్ తో చేసిన ఫాస్ట్ ట్రాక్ యాడ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ యాడ్ చూసి దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘బుజ్జిగాడు’ సినిమాలో అవకాశం ఇచ్చారట. ఆ ఆఫర్ ఈ అమ్మడు లైఫ్ పూర్తిగా మారిపోయింది. తరువాత ‘సొగ్గాడు’ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది.

66
లిమ్కా బుక్ రికార్డు

తెలుగులో బుజ్జిగాడు, సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, డుష్‌శాసన, లవ్ యూ బంగారం వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకవచ్చాయి. ఆమె తన కెరీర్ లో 55 సినిమాల్లో నటించింది, గతంలో బిగ్‌‌బాస్ కన్నడ, మలయాళంలో స్మార్ట్ షో, తెలుగు, కన్నడలలో సిక్స్త్ సెన్స్, హిందీలో ముఝే షాదీ కరోగి అనే షోలో పాల్గొన్నారు సంజన. ఇదేకాదు.. 2015లో ఏకధాటిగా 104 గంటల పాటు సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో సంజన స్థానం సంపాదించారు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories