ఆ తర్వాత సోషల్ మీడియాలో వీడియోలు చేయడం ప్రారంభించింది. క్రమంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడంతో శ్రీజ ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయింది. శ్రీజకి పవన్ కళ్యాణ్, ఎంఎస్ ధోని అంటే పిచ్చి ఇష్టం. ఓ ఇంటర్వ్యూలో శ్రీజ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. నాకు మాత్రమే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఇష్టం. ఎప్పటికైనా మా ఫ్యామిలీ మొత్తం ఆయనతో ఫొటో దిగాలని కోరిక అని శ్రీజ తెలిపింది. ఒక వైపు బిగ్ బాస్ టైటిల్, మరోవైపు పవన్ కళ్యాణ్ తో ఫొటో ఛాన్స్.. ఈ రెండింటిలో దేనిని ఎంచుకుంటావు అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి శ్రీజ తెలివిగా సమాధానం ఇచ్చింది. నా లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు కప్పు గెలవాలనే ప్రోత్సహిస్తారు. కాబట్టి బిగ్ బాస్ కప్పు గెలిచి.. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుతా అని బదులిచ్చింది.